Diego Maradona Girlfriend Says Wedding Bells Planned, No Date Set

Maradona girlfriend rocio oliva says wedding bells planned

Diego Maradona,Football Diego Maradona Girlfriend Says Wedding Bells Planned, No Date Set latest Football news

Diego Maradona is currently engaged in a legal dispute with his former wife, Claudia Villafane, with whom he has two daughters, over a shortage of money in a joint account. He divorced Villafane in 2003. He has two sons and another daughter with three other women.

ఐదవసారి పెళ్లికోడుకు కాబోతున్న మారిడోనా

Posted: 09/09/2015 06:40 PM IST
Maradona girlfriend rocio oliva says wedding bells planned

అర్జెంటీనా మాజీ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు డీగో మారడోనా మరోమారు పెళ్లికోడుకుగా మారనున్నాడు. అంటే ఇది ఎన్నో పర్యాయం అన్న సందేహాం రావడం సహజం. మారడోనా పేరు చెబితే ఫుట్ బాల్ ఆటలో ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లు దడుచుకునే స్థాయిని సంపాదించిన ఆయన.. తాజాగా తన మాజీ స్నేహితురాలు రోస్యో ఒలివా ఒక ఇంటివారు కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ ఫుట్ బాల్ స్టార్ మాజీ ప్రియురాలే తెలిపింది. తన సోదరుని పుట్టిన రోజు సందర్భంగా అర్జంటీనా వచ్చిన ఈ జంట మీడియాతో మాట్లాడారు. వాటికన్ సిటీలో పోప్ సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే వారు విన్నది నిజమేనని తాను మారిడోనా త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. అయితే డిసెంబర్ 13న పెళ్లి ఉంటుందనే వాదనను.. ఒలీవా ఖండించింది. పెళ్లి తేదీని ఇంకా నిర్ణయించలేదని, బహుశా ఈ ఏడాదిలో పెళ్లి జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. మారడోనా.. మాజీ భార్యతో వచ్చిన ఆర్థిక విబేధాల్లో తలమునకలుగా ఉన్నాడు. భార్య క్లౌడియా విల్లాపేన్ కు ఈ ఫుట్ బాల్ దిగ్గజం 2003లో విడాకులు ఇచ్చాడు. అయితే. తమ జాయింట్ అకౌంట్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో డబ్బు అదృశ్యమవ్వడంతో రేగిన పేచీలు.. అమెను కోర్టును ఆశ్రయించేలా చేశాయి. కాగా.. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 54 ఏళ్ల మారడోనాకు క్లౌడియా కాకుండా అంతకుముందు మరో ముగ్గురు భార్యలతో ఇద్దరు అబ్బాయిలు మరో అమ్మాయి కూడా సంతానం. అయితే ఈ మాజీ స్టార్ ప్లేయర్ .. తాజాగా 25ఏళ్ల ఒలీవాను పెళ్లాడనున్నాడు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diego Maradona  Girlfriend  Rocio Oliva  Wedding Bells  

Other Articles