Russia World Cup not affected by change of FIFA president, says sports minister

2018 world cup not affected by change of fifa chief

Russia World Cup not affected by change of FIFA president, says sports minister, 2018 world cup not affected by change of fifa chief, 2018 Russia World Cup, Sepp Blatter, FIFA, Vitaly Mutko"

Russia will not lose the 2018 World Cup whoever succeeds Sepp Blatter as the FIFA president, Russian sports minister Vitaly Mutko said

2018 వరల్డ్ కప్ పై ఆ ప్రభావం ఉండదట..

Posted: 07/09/2015 10:14 PM IST
2018 world cup not affected by change of fifa chief

రష్యా వేదికగా 2018లో జరగనున్న పుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నికి సంబంధించి ఎటువంటి మార్పు ఉండబోదని ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది జరిగిన పిఫా అధ్యక్ష ఎన్నికలలో సెప్ బ్లాటర్ విజయం సాధించడం, ఆపై అతనిపై ఫిపాలో భారీగా అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరడం.. ఈ నేపథ్యంలో తాను తన పదవికి రాజీనామా చేయడం అన్ని వరుసక్రమంలో జరిగిపోయాయి. దీంతో 2018లో రష్యా వేదికగా, 2022 ఖతార్ వేదికగా ప్రపంచకప్ అతిధ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంగా ఇప్టికే పలువురు ఫిఫా పెద్దలు విచారణను ఎదుర్కోంటున్నారు.

ఈ క్రమంలో బ్లాటర్ ను విచారించేందుకు అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు రంగం సిద్దం చేశాయి. ఈ తరుణంలో 2018 లో జరగనున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ రష్యాలో జరుగుతుందా..? లేదా..? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో తాజాగా స్పందించిన రష్యా క్రీడా వ్యవహరాల మంత్రి విటలీ ముక్తో దానికి ముగింపు పలికారు. ప్రస్తుతం పిఫా ఎగ్జిక్యూటివ్ కమిటిలో సభ్యుడిగా వున్న ముక్తో ఏ కోత్త అధ్యక్షుడు వచ్చినా తదుపరి ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ రష్యాలోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. ఆ వరల్డ్ కప్ నిర్వహణ అనేది రష్యా ప్రాజెక్టు కాదు.. పిఫా ప్రాజెక్టు అని ముక్తో స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిపా యాజామాన్యం తీసుకున్న నిర్ణయాలలో ఏటువంటి మార్పులు ఉండవని అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2018 Russia World Cup  Sepp Blatter  FIFA  Vitaly Mutko  

Other Articles