Indian players won gold silver and bronze medals

Indian players won gold silver and bronze medals in CWG 2014, commonwealth games 2014 in the sixth day, commonwealth games 2014, indian players in commonwealth games, india won medals in commonwealth games, gold medals for indian players in commonwealth games, susheel kumar won gold medal in rejling wrestling, amith kumar won gold medal in wrestling, silver medals to indian players in commonwealth games, commonwealth games 2014 latest news

Indian players won gold silver and bronze medals in commonwealth games 2014 in the sixth day

కామన్ వెల్త్ లో స్వర్ణాలతో మెరిసిపోయిన భారత్!

Posted: 07/30/2014 11:43 AM IST
Indian players won gold silver and bronze medals

గ్లాస్గో కామన్వెల్త్ పోటీల్లో భారత్ స్వర్ణాలతో మెరిసిపోతోంది. ఆటగాళ్లు తమ పనితీరుతో విజయాలు సాధిస్తూ.. ఇండియాకు అరుదైన గౌరవాన్ని దక్కిస్తున్నారు. కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ కు పసిడిపంట పండింది. ఈ పోటీల్లో సుశీల్, అమిత్, నివేక్ కు వరుసగా స్వర్ణపతకాలు లభించాయి. అయితే రాజీవ్ తోమర్ మాత్ర రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇందులోనే కాదు... షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో కూడా భారత్ తన సత్తా చాటుకుంది. లిఫ్టింగ్ లో వికాస్ ఠాకుర్, హర్ ప్రీత్ సింగ్, సంజీవ్ రాజ్ పుత్ లు రజత పతకాలు సొంతం చేసుకోగా.. నారంగ్, సంధు, లజ్జ గోస్వామి ఆటగాళ్లు కాంస్య పతకాలను సాధించుకుని భారత్ కు పతకాల పంటను పండిస్తున్నారు. ఆరో రోజయిన ఒక్కరోజులోనే భారత్ 10 పతకాలు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు కామన్వెల్త్ లో ఒకేరోజు భారత్ఇన్నిపతకాలను గెల్చుకుని, అత్యుత్తమగా ప్రదర్శించడం ఇదే మొదటిసారి!

కామన్వెల్త్ లో మంగళవారంనాడు భారత్ కు పండగే పండగ! రెజ్లర్ల ప్రదర్శనలో సుశీల్ కుమార్ 74కేజీ ఫ్రీస్టైల్ లో, అమిత్ కుమార్ 57కేజీ ఫ్రీ స్టైల్ లో, మహిళల 48 కేజీ ఫ్రీస్టైల్ లో వినేశ్ పోగత్ స్వర్ణపతకాలను గెలుచుకున్నారు. వీరిలో అమిత్ మొదటిసారి రెజ్లింగ్ లో రాణించి భారత్ కు పసిడి పతకాన్ని అందించాడు. ఈ ముగ్గురి ఆటగాళ్లలో సుశీల్ కుమార్ ప్రదర్శన ఎంతో అద్భుతంగా కనబరిచాడు. అయితే రాజీవ్ తోమర్ కొంతవరకు నిరాశపరిచాడు. వెయిట్ లిఫ్టింగ్ లో వికాస్ ఠాకూర్ అదరగొట్టేశాడు. పురుషుల 85 కేజీ విభాగంలో రజతం చేజిక్కించుకున్నాడు. మొత్తం 333 (150+183) కిలోల బరువెత్తి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

షూటింగ్ లో భారత్ కు పతకాల ప్రవాహం కొనసాగింది. స్వర్ణపతకాలు లేకున్నా.. షూటింగ్ ఆఖరిరోజు మరో ఐదు పతకాలు భారత్ ఖాతాలో చేరిపోయాయి. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ లో హర్ ప్రీత్ సింగ్ రజతం సాధించాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో భారత్ రెండు పతకాలను గెలుచుకుంది. సంజీవ్ రాజ్ పుత్ రజతం సాధించగా.. గగన్ నారంగ్ కాంస్యంతో సంతృప్తి చెందాడు. ఇక పురుషుల ట్రావ్ ఈవెంట్లో మానవ్ జిత్ సంధు కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో లజ్జ గోస్వామి కాంస్యం గెలుచుకుంది. దీంతో షూటింగ్ లో భారత్ కు మొత్తం 17 పతకాలు లభించాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles