Matsya santoshi won bronze medal in commonwealth games 2014

telugu girl matsya santoshi won bronze medal abhinav bindra gold medal in commonwealth games 2014, abhinav bindra won gold medal, commonwealth games 2014, commonwealth games 2014 latest news, matsya santhoshi commonwealth games 2014, abhinav bindra commonwealth games 2014, abhinav bindra latest news, matsya santhoshi latest news, weight lifter matsya santhoshi, shooter abhinav bindra

telugu girl matsya santoshi won bronze medal abhinav bindra gold medal in commonwealth games 2014

కామన్వెల్త్ లో దూసుకుపోతున్న భారత్.. తెలుగమ్మాయి ఉత్తేజం!

Posted: 07/26/2014 12:26 PM IST
Matsya santoshi won bronze medal in commonwealth games 2014

ప్రస్తుతం గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ అన్ని విభాగాల్లో కాకపోయినా... కొన్నింటిలో మాత్రం క్రీడాకారులు తమ సత్తాచాటుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మన తెలుగమ్మాయి మత్స సంతోషి మన తెలుగుజాతితోపాటు యావత్తు బారతదేశానికి ఒక అరుదైన గౌరవాన్ని దక్కేలా తన ప్రతిభను ప్రదర్శించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 53 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని తన సత్తా చాటిచెప్పింది.

53 కేజీల విభాగంలో పోటీపడిన సంతోషి 188 కేజీల బరువును ఎత్తి మూడోస్థానంలో నిలిచింది. స్నాచ్ లో తొలిమూడు ప్రయత్నాల్లో (78, 81, 83 కేజీలు) సఫలమైన ఈ క్రీడాకారిణి... క్లీన్ అండ్ జర్క్ లో తొలి రెండు ప్రయత్నాల్లో (102, 105 కేజీలు) సఫలమయింది. అయితే చివరలో 109 కేజీల బరువు ఎత్తడానికి ప్రయత్నించి విఫలం అవడంతో మూడోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో నైజీరియాకు చెందిన చికా అమలహ స్వర్ణ పతకాన్ని, పపువా న్యూగినియాకు చెందిన ఇద్దరు బిడ్డల తల్లి డికా తౌవా రజత పతకాన్ని సొంతం చేసుకోగా.. మత్స సంతోషి కాంస్య పతకాన్ని సాధించింది. ఈమె స్వగ్రామం విజయనగరజిల్లాలోని కొండవెలగామ గ్రామం!

ఇదిలావుండగా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా తన అద్భుత ప్రతిభతో స్వర్ణ పతకాన్ని సాధించి, తన సత్తాను చాటుకున్నాడు. భారత కీర్తి ప్రతిష్ఠలను మరింతగా పెంచేశాడు. బింద్రా 203.5 పాయింట్లతో అగ్నస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నాడు. అలాగే 10 ఎం పిస్టల్ విభాగంలో మలైకా గోయల్ రజత పతకాన్ని సాధించి, తన సత్తాను చాటుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లో తొలిరోజు ఏడు పతకాలను గెల్చుకున్న భారత్.. రెండోరోజు రెండు పతకాలను కైవసం చేసుకుంది. దీంతో భారత్ కు మొత్తం 9 పతకాలు లభించాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles