Players, not mentor, must deliver: Sunil Gavaskar ఒత్తిడిని జయించి.. ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్

T20 world cup sunil gavaskar addresses hype on ms dhoni s role with team india

Ind vs Pak, Sunil Gavaskar, MS Dhoni, T20 World Cup, Gavaskar on Dhoni, India vs Pakistan, Sunil Gavaskar on MS Dhoni Mentorship, T20 World Cup dhoni mentor, Virat Kohli and team, ICC Men’s T20 World Cup, ICC Men’s T20 World Cup 2021, Indian cricket, Sports news, Cricket news, sports, Cricket

Legendary batter and former captain Sunil Gavaskar on Friday, while talking about MS Dhoni's role with Team India in the ongoing T20 World Cup, remarked that there is only so much a mentor can do and that it's the players that have to go out and perform the 'actual task.'

ఒత్తిడిని జయించి.. బాధ్యతగా ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్

Posted: 10/23/2021 07:18 PM IST
T20 world cup sunil gavaskar addresses hype on ms dhoni s role with team india

వేగంగా మారే టి20 ఫార్మాట్‌లో ఆటగాళ్లను సన్నద్ధపరచడంలోనే మెంటార్‌ సహాయపడగలడని... అసలు బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నారు. ‘బయట నుంచి సలహాలివ్వడం, వ్యూహాలు పన్నడం మాత్రమే మెంటార్‌గా ధోని పని. కానీ అసలు పని మైదానంలో దిగే ఆటగాళ్లదే. ఒత్తిడిని తట్టుకోవడం, అప్పజెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించడం ఆటగాళ్లే చేయాలి’ అని సన్నీ వివరించారు.

టీ20 ఫార్మాట్‌లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదన్న గావస్కర్‌... ఆదివారం నాటి టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఏ జట్టునూ ఫేవరెట్‌గా భావించవద్దని సూచించారు. అవసరమైన సమయంలో ఒత్తిడిని జయించి... నో బాల్స్‌ వంటి తప్పిదాలు చేయకుండా ఉన్న జట్టునే విజయం వరిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 24న టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య జరిగే పోరు కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  T20 World Cup 2021  India vs Pakistan  MS Dhoni  sports  Cricket  

Other Articles