Ravi Shastri look at exit route after T20 World Cup చీఫ్ కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై.. టీ20 టోర్నీ లాస్ట్.!

Ravi shastri to quit as team india coach after t20 world cup report

india cricket coach, ravi shastri, ravi shastri india, rahul dravid india, india cricket team, Sports, T20 world cup, TeamIndia, Cricket news, sports news, Cricket

Ravi Shastri has informed some cricket board members that he is planning to part ways with the national team after the tournament when his contract ends, it is learnt. Some of the other support staff, meanwhile, are already in talks with IPL teams.

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై.. టీ20 టోర్నీ లాస్ట్.!

Posted: 08/11/2021 07:48 PM IST
Ravi shastri to quit as team india coach after t20 world cup report

టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలంకతో జూనియర్ జట్టును తీసుకెళ్లి కూడా వారిపై వన్డేలలో విజయం సాధించిన ద్రావిడ్.. టీ20లో క్రికెటర్లకు కరోనా సోకడం కారణంగా టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెళ్లిపోనున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది. చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి రవిశాస్త్రి చెప్పేశారని సమాచారం.

టెక్నికల్ గా ఇక్కడ ఒక కీలకమైన అంశం కూడా ఉంది. టీమిండియా చీఫ్ కోచ్ పదవిలో ఉండేవారి గరిష్ట వయస్సు 60 ఏళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 59 ఏళ్లు దాటాయి. ఈ కారణంగా కూడా ఆయన ఇకపై కొనసాగే అవకాశం లేదు. టీ20 ప్రపంచకప్ ముగిసే సమయానికి రవిశాస్త్రి వయసు 60 ఏళ్లు ఉంటుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత చీఫ్ కోచ్, సహాయ కోచ్ ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించనుంది.

మరోవైపు, అండర్-19, భారత్-ఏ టీమ్ కోచ్ గా ద్రావిడ్ విజయవంతమయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా రిజర్వ్ బెంచ్ ను పటిష్ఠం చేసిన ఘనత కూడా ఆయన సొంతం. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి వారికి ద్రావిడ్ అత్యంత సన్నిహితుడు. వీరందరూ కలిసి టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఈ రకంగా చూసినా ద్రావిడ్ చీఫ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles