సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ముంబై బ్యాట్స్ మెన్ క్రీజులోకి వచ్చీ రాగానే సిక్సర్ తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మంచి షాట్ ఆడి ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించాడు. 28 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్.. రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక మంగళవారం నాటి మూడో టీ20లో తుది జట్టులో అతడికి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సూర్యకుమార్.. తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాదిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 6 బౌండరీలు, 3 సిక్సర్లు బాదిన సూర్య.. మొత్తంగా 31 బంతుల్లో 57 పరుగులు చేసి సామ్ కర్రన్ బౌలింగ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలైపోయి పెవిలియన్ చేరాడు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more