Udana refuses to run-out injured player నెటిజనుల హృదయాలు గెలిచిన లంక బౌలర్

Spirit of cricket isuru udana refuses to run out injured player

Isuru Udana, Heino Kuhn, Marco Marais, Mzansi Super League 2019, MSL, Nelson Mandela Bay Giants, Paarl Rocks, Cricket, BCCI, IPL, sports news, cricket, sports, cricket, sports

In the ongoing Mzansi Super League (MSL), Sri Lankan bowler Isuru Udana won the hearts of netizens for his sportsmanship after he refused to run-out an injured player despite having a lot of time to do so.

స్పోర్ట్స్ మెన్ షిప్: నెటిజనుల హృదయాలు గెలిచిన లంక బౌలర్

Posted: 12/11/2019 05:42 PM IST
Spirit of cricket isuru udana refuses to run out injured player

శ్రీలంక పేసర్‌ ఇసురు ఉడానపై ఇప్పుడు నెట్ జనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ గాయపడిన క్రమంలో అతడ్ని ఔట్ చేసే అవకాశం వున్నా.. వదిలేసి తనలో  క్రీడాస్ఫూర్తి ఎంతలా వుందో ప్రపంచానికి చాటాడు. రనౌట్‌ చేసేందుకు నిరాకరించి నెట్టింట్లో హీరో అయ్యాడు. ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాలో జాన్సీ సూపర్‌ లీగ్‌ (ఎంఎస్‌ఎల్‌) జరుగుతోంది. నెల్సన్‌ మండేలా బే గెయింట్స్‌, పార్ల్‌ రాక్‌ జట్లు తలపడ్డాయి. చివరి ఎనిమిది బంతుల్లో బే గెయింట్స్‌ విజయానికి 24 పరుగులు అవసరం.

ఈ దశలో పార్ల్‌రాక్‌ పేసర్‌ ఉడాన వేసిన బంతిని హీనో కున్‌ భారీ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. అప్పటికే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చిన మార్కో మరాయిస్‌కు ఆ బంతి బలంగా తగిలింది. నొప్పితో అతడు విలవిల్లాడు. వెనక్కి పరుగెత్తలేకపోయాడు. పక్కనే పడ్డ బంతిని అందుకున్న ఉడాన వికెట్ల వద్దకు వచ్చినా ప్రత్యర్థి పరిస్థితి చూసి చలించాడు. అవకాశం ఉన్నప్పటికీ వికెట్లను గిరాటేయలేదు. ఆ తర్వాత మరాయిస్‌ క్రీజులోకి వచ్చాడు.

ఉడాన చూపిన క్రీడాస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అతడి స్ఫూర్తికి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ‘క్రీడా స్ఫూర్తి వర్ధిల్లింది’ అని ఎంఎస్‌ఎల్‌ ట్వీట్‌ చేసింది. ‘ఇసురు ఉడాన నుంచి గొప్ప ప్రయత్నం’ అని విజ్డెన్‌ పేర్కొంది. అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ తబ్రైజ్‌ శంషీ ఓ వికెట్‌ తీసినప్పుడు ఇదే లీగ్‌లో ఇంద్రజాలం చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles