Gavaskar does'nt want Pant to bat at No. 4 నాలుగో స్థానంలో పంత్ వద్దన్న లిటిల్ మాస్టార్

Sunil gavaskar does nt want rishabh pant to bat at no 4 for india

shreyas iyer, india vs west indies, Rishabh Pant, sunil gavaskar, virat kohli, india tour of west indies, sports news, cricket news, Sports, Cricket

Indian batsman Shreyas Iyer scored a valuable 71 off 68 balls to help India reach a respectable total against West Indies. Praising Iyer, Sunil Gavaskar said that this knock should help Iyer get a permanent position in the Indian ODI team.

నాలుగో స్థానంలో పంత్ వద్దన్న సునీల్ గవాస్కర్

Posted: 08/12/2019 08:07 PM IST
Sunil gavaskar does nt want rishabh pant to bat at no 4 for india

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని నాలుగో స్థానంలో ఇకపై ఆడించకపోవడమే మంచిదని దిగ్గజ క్రికెటర్ లిటిల్ మాస్టార్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో నెం.4లో ఆడిన రిషబ్ పంత్ 35 బంతుల్లో 20 పరుగులు చేసి పేలవంగా బౌల్డయ్యాడు. కానీ.. నెం.5లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 68 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 71 పరుగులతో సత్తాచాటాడు. దీంతో.. శ్రేయాస్‌ని ఇకపై నెం.4లో ఆడించాలని గవాస్కర్ సూచించాడు.

‘నా అంచనా ప్రకారం రిషబ్ పంత్ కూడా మహేంద్రసింగ్ ధోనీ తరహాలో ఐదు లేదా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కి సరిపోతాడు. ఫినిషర్‌గా మ్యాచ్‌ల్ని ముగించడానికి అతని బ్యాటింగ్ స్టైల్ చక్కగా నప్పుతుంది. ఇంకా చెప్పాలంటే.. పంత్ సహజ సిద్ధమైన ఆటే పవర్ హిట్టింగ్. ఒకవేళ భారత్ జట్టుకి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ భారీ స్కోరుతో మెరుగైన ఆరంభమిచ్చి.. 40-45 ఓవర్ల మధ్య నెం.4 బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి వెళ్లాల్సి వస్తే..? అప్పుడు రిషబ్ పంత్‌ని పంపించాలి.

అలాకాకుండా.. 30-35 ఓవర్ల మధ్య నెం.4 బ్యాట్స్‌మెన్‌ని పంపాల్సి వస్తే మాత్రం.. శ్రేయాస్ అయ్యర్‌‌కి అవకాశమివ్వాలి’ అని గవాస్కర్ సూచించాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో నేరుగా వచ్చిన బంతిని ఎదుర్కోవడంలో తడబడిన రిషబ్ పంత్.. బ్యాట్‌ని అడ్డంగా ఊపి క్లీన్ బౌల్డయ్యాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అతను తక్కువ స్కోరు చేయడం కంటే.. అతను ఔటైన తీరే టీమిండియాలో కంగారు పెంచుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shreyas iyer  india vs west indies  Rishabh Pant  sunil gavaskar  virat kohli  Sports  Cricket  

Other Articles