Not surprised with Dhoni drop from T20: Ganguly ధోని తొలగింపులో అశ్చర్యం లేదన్న గంగూలీ

Not surprised ms dhoni has been dropped from t20 squad ganguly

Sourav Ganguly, MS Dhoni, Team India, West Indies, Jharkhand Team, One day world cup, T20 world cup, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Ganguly believes that the selectors should have a word with him and ask him to play for Jharkhand in the upcoming season in order to get practice and game time to fine tune his game.

ధోని ఫామ్ లోకి వస్తేనే టీమిండియాకు మేలు

Posted: 10/31/2018 04:16 PM IST
Not surprised ms dhoni has been dropped from t20 squad ganguly

ధోని ఫామ్ లోకి వస్తేనే టీమిండియాకు మేలుభారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనిని వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేయకపోవడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ధోని ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో అతను ముందుగా ఫామ్ లోకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో ధోని మంచి ప్రదర్శన చేయాలంటే ఝార్ఖండ్‌ రంజీ జట్టు తరఫున ఆడాలని సూచించాడు. అప్పుడే ఫామ్‌ కొనసాగించొచ్చని దాదా పేర్కొన్నాడు.

‘టీ20 జట్టు నుంచి ధోనీని తప్పించడం తనకేమీ ఆశ్చర్యం అనిపించలేదని గంగూలీ అన్నాడు. ఎందుకంటే అతడి ప్రదర్శన ఆశాజనకంగా లేదని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు మహీ కొనసాగుతాడన్న నమ్మకమూ తనకు లేదని అభిప్రాయపడ్డాడు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్‌ పంత్ కు అవకాశం ఇచ్చి వుంటారని అన్నాడు. అయితే సెలక్టర్లు ధోనీని వన్డే ప్రపంచకప్‌ ఆడించాలనుకుంటే మాత్రం చాలినన్ని అవకాశాలు ఇవ్వాల్సిందేనని అన్నాడు.

వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ తర్వాత మహీ దేశవాళీ మ్యాచులు ఎక్కువ ఆడేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్ లను నేరుగానే ఆడతాడు. నిరంతర సాధన లేకుండా ఇంత అంతరంతో వన్డేలు ఆడటం చాలా కష్టం’ అని దాదా వెల్లడించాడు. ధోనీని జట్టు నుంచి తొలగించడంతో అతడి అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్‌నకు రెండో వికెట్‌ కీపర్‌ను సిద్ధం చేసేందుకే ఎంఎస్‌ ధోనీకి విశ్రాంతి కల్పించామని సెలక్టర్లు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles