Abdur Rehman announces international retirement అంతర్జాతీయ క్రికెట్ కు అబ్దర్ రహమాన్ వీడ్కోలు..

Pakistan spinner abdur rehman quits international cricket

pak spinner retirement, Pak left-arm spinner, Abdur Rehman, retirement, international cricket, Pakistan, Cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Abdur Rehman, the 38-year-old Pakistani left-arm spinner, has announced his retirement from international cricket, but will continue playing domestically.

అంతర్జాతీయ క్రికెట్ కు అబ్దర్ రహమాన్ వీడ్కోలు..

Posted: 10/10/2018 04:48 PM IST
Pakistan spinner abdur rehman quits international cricket

పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్దుర్ రహ్మాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఇవాళ గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో 2012లో జరిగిన సిరీస్ లో పాకిస్థాన్ అద్భుతంగా రాణించింది. ఇంగ్లిష్ జట్టును వైట్ వాష్ చేసింది. ఈ సిరీస్ లో రహ్మాన్ మొత్తం 19 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. సియోల్ కోట్ ‌కు చెందిన ఈ స్పిన్నర్ 2006లో స్వదేశంలో విండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

అదే ఏడాది దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2011 ప్రపంచకప్ లో ఆడిన రెహ్మాన్ 2014 నుంచి ఆడడం లేదు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రహ్మాన్.. దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతానని పేర్కొన్నాడు. తన కెరీర్ లో 22 టెస్టు మ్యాచులు అడిన రహ్మాన్ 29.39 సగటున 99 వికెట్లను తీసుకున్నాడు. టెస్టుల్లో 25 పరుగులకు ఆరు వికెట్లను తీసుకోవడం ఇది బెస్ట్ ఫిగర్.

కాగా, 31 వన్డేలతో 38.06 సగటున 30 వికెట్లు తీసుకున్నాడు అబ్దుర్ రహ్మాన్. వన్డేలలో 48 పరుగులకు నాలుగు వికెట్లు సాధించడం అతని బెస్ట్ స్కోర్ గా నిలించింది. ఇక టీ20లలో కేవలం 11 మ్యాచులను మాత్రమే అడిన రహ్మాన్ 17.45 సగటున 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20లలో ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లను తీసుకున్న రహ్మాన్ కు అదే బెస్టు స్కోరగా నిలిచింది. మిస్ బాహ్ కెప్టెన్సీ తొలిరోజుల్లో ఆయన జట్టుకు కొండంత బలంగా వున్న రహ్మన్ అకస్మికంగా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pak left-arm spinner  Abdur Rehman  retirement  international cricket  Pakistan  Cricket  sports  

Other Articles