Sohail Khan throws ball at Yasir Shah పాకిస్తాన్ క్రికెట్ లీగ్ మళ్లీ ఇలా వార్తల్లోకి..

Psl 2018 sohail khan throws ball at yasir shah to get his attention

pakistan super league, yasir shah, sohail khan, psl 2018, pakistan cricket, psl points table, psl cricket, psl pakistan, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

PSL 2018 witnessed a funny incident when Sohail Khan threw the ball at Yasir Shah to get the fielder's attention while he was about to bowl.

పాకిస్తాన్ క్రికెట్ లీగ్ మళ్లీ ఇలా వార్తల్లోకి..

Posted: 03/15/2018 06:11 PM IST
Psl 2018 sohail khan throws ball at yasir shah to get his attention

పాకిస్థాన్ సూపర్‌ లీగ్.. రికార్డులతో కాకుండా మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటు చేసుకుంటున్న ఘటనలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల అఫ్రిది ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఔట్‌ చేసి పెవిలియన్ దారి చూపించి విమర్శలు ఎదుర్కొవడంతో తన ట్విటర్ ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పి వార్తలో నిలిచాడు. ఇక తాజాగా ఒకే జట్టు ఆటగాళ్లు కోపంతో ఒకరిపై ఒకరు బంతులు విసురుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌-లాహోర్‌ క్వాలాండర్స్‌ మధ్య మ్యాచు జరిగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. అనంతరం క్వెట్టా బ్యాటింగ్ ప్రారంభించింది. 18 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీంతో మరో రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సివుండగా, 19వ ఓవర్‌ వేసేందుకు సోహైల్‌ ఖాన్‌ బంతని అందుకుని తొలి బంతిని వైడ్ వేసి.. ఆ తరువాత మూడు బంతులు విసిరాడు. నాలుగో బంతికి ఫీల్డింగ్లో మార్పులు చేశాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న యాసిర్‌ షాకు అటుగా జరగమని సోహైల్ సూచించాడు.

అయితే  అది గమనించని యాసిర్ పై అగ్రహంతో బంతిని విసిరాడు. అదృష్టవశాత్తూ అది యాసిర్ కు కొద్ది దూరంలో పడింది. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన యాసిర్.. తిరిగి సోహైల్‌ వైపు ఇలా బంతిని విసురుతావా..? అంటూ ప్రశ్నించి.. ఆ తరువాత బలంగా బంతిని సోహైల్ వైపు విసిరాడు. ఇంతలో సహచర ఆటగాళ్లు సర్ది చెప్పడంతో యథావిధిగా ఆట కొనసాగింది. ఈ మ్యాచులో లాహోర్‌ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటగాళ్లలో నశిస్తున్న క్రీడా స్ఫూర్తికి ఇది దర్పణం పడుతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan super league  yasir shah  sohail khan  psl 2018  psl pakistan  cricket news  cricket  

Other Articles