అతిత్య జట్టు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో వరుసగా విమర్శలను ఎక్కుపెట్టిన సీనియర్లు, నెట్ జనులకు తన బ్యాటుతోనే బదులివ్వాలని భావించిన టీమిండియా కెప్టెన్ అదే పనిచేశాడు. వన్డే సిరీస్ లో భాగంగా డర్భన్ వేదికగా కింగ్స్ మీడ్ మైదానంలో జరిగిన తొలివన్డేలో టీమిండియాను కెప్టెన్ ఇన్నింగ్స్ అడి విజయతీరాలకు చేర్చాడు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు శతకంతో బదులిచ్చాడు.
డర్భన్ లో టీమిండియా ట్రాక్ రికార్డు పేలవంగా వున్నా.. ఈ మ్యాచ్ సఫారీల చేతుల్లోకే వెళ్తుందని అంచనాల నేపథ్యంలో విరాట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతనికి తోడుగా అజింక్య రహానే కూడా బాగా రాణించాడు. నంబర్ నాలుగో స్థానంలో అతనిదేనని అంతకుముందే చెప్పుకోచ్చిన విరాట్ సహా జట్టు యాజమాన్యం అంచనాలకు తగ్గటుగా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు రహానె.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కన్నేసిన టీమిండియాకు వన్డే సిరీస్‌లో అదిరే ఆరంభం లభించింది. కెప్టెన్ కోహ్లి (112; 119 బంతుల్లో 10×4), రహానె (79; 86 బంతుల్లో 5×4, 2×6) అదరగొట్టడంతో తొలి వన్డేలో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. మొదట స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/34), చాహల్ (2/45) మాయ చేయడంతో దక్షిణాఫ్రికాను భారత్ 269/8కి కట్టడి చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (120; 112 బతుల్లో 11×4, 2×6) సెంచరీతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియాలో రోహిత్ శర్మ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ కు చేరగా, అతని వెంటనే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 35 పరుగులకు వెనుదిరిగాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి- అజింక్య రహానెలు అద్భుత భాగస్వామ్యం (189)తో లక్ష్యాన్ని 45.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే ఆదివారం సెంచూరియన్ లో జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more