Mitali Raj on Cusp of becoming Leading Run Scorer మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు..

Mitali raj on cusp of becoming leading run scorer

ICC Women's World Cup 2017, India vs Ajstralia, India Women's Cricket Team, Mithali Raj, Charlotte Edwards, Kristen Beams, ICC Women's World Cup, Cricket news, cricket news, cricket, sports news, latest news

India captain Mithali Raj scripted history on Wednesday as she became the all-time leading run-getter in women's one-day internationals.

మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు..

Posted: 07/12/2017 08:39 PM IST
Mitali raj on cusp of becoming leading run scorer

భారత మహిళా జట్టు సారథి మిథాలీరాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ గా రికార్డులకెక్కారు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో అమె ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్ వర్డ్స్ పేరిట ఉన్న (5,992) రికార్డును మిథాలీ అధిగమించి నూతన రికార్డును నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులోనే 1999లో టీమిండియాలోకి అడుగుపెట్టిన మిథాలీరాజ్ ఇప్పటి వరకు 183 వన్డేలు ఆడారు.

19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో 214 పరుగులు చేసి తొలిసారి వార్తల్లోకి ఎక్కారు. కాగా ఇటీవలే అత్యధిక అర్ధ శతకాల రికార్డు (48)ను సాధించారు. ఆ తరువాత వరుసగా ఏడు అర్థశతకాలను నమోదు చేసిన క్రీకెటర్ గా కూడా రికార్డు నమోదు చేసుకున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ ఎడ్ వర్డ్స్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. 191 మ్యాచ్‌లలో 38.17 సగటుతో ఈ రికార్డు ఎడ్ వర్డ్స్‌ సాధించగా.. మిథాలీరాజ్ ఆ రికార్డును కేవలం 183 మ్యాచుల్లో 51.56 సగటుతో అధిగమించడం విశేషం. ఇప్పటి వరకు 5 శతకాలు సాధించిన మిథాలీ.. వన్డేల్లో అత్యధిక స్కోరు 114 నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles