Twitter reacts to Ravi Shastris' appointment కోచ్ రవిశాస్త్రీకి క్రీడాభిమానుల ప్రశంసల వెల్లువ..

Ravi shastri named india coach twitter reacts to appointment

anil kumble, coach anil kumble, indian cricket coach, bcci, sourav ganguly, sachin tendulkar, vvs laxman, india coach, virat kohli, cricket news, sports news, Team India, cricket

BCCI confirmed the appointment of Ravi Shastri as the new head coach of the Indian cricket team. The announcement resulted in a bustle of reactions on Twitter.

కోచ్ రవిశాస్త్రీకి క్రీడాభిమానుల ప్రశంసల వెల్లువ..

Posted: 07/12/2017 07:49 PM IST
Ravi shastri named india coach twitter reacts to appointment

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి నియామకం పట్ల పలువురు భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం భారత క్రికెట్ కు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రవిశాస్త్రి నేతృత్వంలో భారత్ అద్భుతంగా రాణించాలని కోరుకున్నారు. భారత క్రికెటర్ రైనా ట్విటర్లో కోచ్ లుగా నియమితులైన రవిశాస్త్రి, జహీర్ ఖాన్‌, రాహుల్ ద్రావిడ్ లకు శుభాకాంక్షలు తెలిపాడు. వారు విజయవంతం కావాలని ఆకాక్షించాడు. మాజీ క్రికెటర్ కైఫ్‌ ‘జహీర్‌ను బౌలింగ్‌ కోచ్ గా తీసుకోవడం అద్భుత నిర్ణయం. రవిశాస్త్రి నేతృత్వంలోని భారత జట్టుకు శుభాకాంక్షలు. ఇక అంతా క్రికెట్ పైనే దృష్టిపెడతరాని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘బంగర్‌, శ్రీధర్ తమ పాత్రల్లోనే కొనసాగబోతున్నారు. శాస్త్రి గతంలో పోషించిన పాత్రనే ఇప్పుడూ పోషిస్తారు. కేవలం హోదాలు మారాయంతే.’- ఆకాష్‌ చోప్రా.

‘నా సోదరుడు జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పాత్రకు ఆల్ ద బెస్ట్‌.’- హర్భజన్‌సింగ్‌

ఇక ట్విటర్‌లో పలువురు అభిమానులు అభినందన సందేశాలు పెట్టారు. అయితే కొందరు అనిల్ కుంబ్లేకు మద్దతుగా.. అప్పుడు జహీర్‌, ద్రవిడ్ అవసరం రాలేదు.. కానీ.. ఇప్పుడు రవిశాస్త్రికి మాత్రం ఎందుకో అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. భారత్‌ క్రికెట్ కు తాజా నిర్ణయం మేలు చేస్తుందని.. విదేశాల్లో భారత్ మరింత మెరుగ్గా రాణిస్తుందని మరికొందరు ధీమా వ్యక్తం చేశారు. భారత్ క్రికెట్లో ‘ట్రేసర్‌బుల్లెట్‌’గా పేరుగాంచిన రవిశాస్త్రికి స్వాగతమంటూ మరికొందరు ట్వీట్లు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  ravi shastri  anil kumble  sourav ganguly  bcci  cricket  

Other Articles