Ashwin against southpaws will be preferred choice సఫారీలతో కీలక మ్యాచ్ లో అశ్విన్..? విరాట్ వ్యూహం..!

Ashwin against southpaws will be preferred choice

Champions Trophy, India v South Africa, Ashwin, JP Duminy, David Miller, Ravichandran Ashwin, south africa, Team india, virat kohli, ab devillers, Neil McKenzie, champions trophy 2017, cricket

India's premier off spinner Ravichandran Ashwin may be back in the mix after being dropped in the first two games and South Africa batting coach Neil McKenzie feels that the tweaker would be a preferred choice against his team.

సఫారీలతో కీలక మ్యాచ్ లో అశ్విన్..? విరాట్ వ్యూహం..!

Posted: 06/10/2017 07:28 PM IST
Ashwin against southpaws will be preferred choice

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ విరాట్ సేనకు అత్యంత కీలకం కానుంది. సెమీస్ అశలు సజీవంగా వుండాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగి టీమిండియా గెలుపోందాల్సిందే. అటు సపారీలకు కూడా ఈ మ్యాచ్ అంతే కీలకం. పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన సఫారీలకు టీమిండియాతో జరిగే మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ కు వెళ్లగలుగుతుంది. దీంతో రెండు జట్లకు ఈ అదివారం పెద్ద పరీక్షగానే నిలువనున్నాయి. రేపు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లకు ప్రతిష్ట్మాతకంగా మారడంతో ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.

సపారీల గెలుపు మాట అటుంచితే.. టీమిండియా గెలుపు కోసం విరాటుడు మాత్రం కొత్త వ్యూహాలను రచిస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా అక్కడ ఫీల్డులపై జరుగుతున్న టోర్నీలో స్పిన్నర్ల కన్నా అల్ రౌండర్లకు ప్రాధాన్యతను ఇచ్చిన కోహ్లీ.. ఇక టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తదుపరి మ్యాచ్ లలో తీసుకోనున్నాడని సమాచారం. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో డీకాక్, డుమిని, డేవిడ్ మిల్లర్ల వంటి ఎడమచేతి స్టార్ ఆటగాళ్లు ఉండటం చేత అశ్విన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు.
 
రేపటి మ్యాచ్ లో అశ్విన్ కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్ లో అశ్విన్ ఎంపిక  కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. మరొకవైపు శ్రీలంకతో ఓటమి భారత ఆటగాళ్ల మదిలో తీవ్రంగా ఉందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై  ఒత్తిడి నెలకొన్న తరుణంలో దాన్నిసద్వినియోగం చేసుకుంటామన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ లో ఓటమితో భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు. కచ్చితంగా భారత్ తో రసవత్తర పోరు ఖాయమన్నాడు.

కాగా అశ్విన్ లేకుండా టీమిండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విన్ తో విభేధాల కారణంగానే అతన్ని కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతున్న తరుణంలో.. జట్టు ప్రయోజనల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టాలన్న సూచనలు కూడా వినబడుతున్నాయి. టీమిండియా డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి నిలుస్తున్న క్రమంలో కేవలం 191 మ్యాచ్ లలో 288 వికెట్లు సాధించిన ఛాంపియన్ కు పక్కనబెట్టడం ఎంతవరకు సమంజమని కూడా పలువురు మాజీ టీమిండియా బౌలర్లు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles