Kohli Revealed Tournament's Best Six Secret ఆ నవ్వుకు రీజన్ చెప్పిన విరాట్ కోహ్లీ

Virat kohli tried to pick up 2 runs ended up with tournament s best six

Royal challengers bangalore, ipl-10, virat kohli, delhi daredevils, Corey Anderson, indian premier league, cricket, indian premier league 2017, ipl 10, ipl 2017

I was looking to push this between the two fielders to try and pick up two but I think Corey (Anderson) bowled a cross-seam ball. I'm pretty happy with the way I hit the ball and more happy that I did it in a winning cause," Virat said during the post-match presentation.

ఆ నవ్వుకు రీజన్ చెప్పిన విరాట్ కోహ్లీ

Posted: 05/16/2017 05:42 PM IST
Virat kohli tried to pick up 2 runs ended up with tournament s best six

ఐపీఎల్ పదో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కానీ లేక ఆయన జట్టులోని దిగ్గజ బ్యాట్స్ మెన్లు కానీ తమ స్థాయికి తగ్గట్టుగా రాణించ లేకపోయారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్ లో మాత్రం గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ  మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా కోరీ ఆండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన షాట్ ఎవరూ మర్చిపోలేరు.

పది పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద వున్న కోహ్లీ ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి ఏదో చిన్న షాట్ కొట్టినట్లుగా కొడితే, అది కాస్తా ఏకంగా 67 మీటర్ల దూరం వరకు గాల్లోనే ప్రయాణించి సిక్సర్‌గా మారింది. ఆ షాట్ ఆడిన తర్వాత కోహ్లీ ఎందుకో నవ్వుకున్నాడు. అయితే ఆ నవ్వు ఎందుకో మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది. వాస్తవానికి తాను ఫీల్డర్ల మధ్య నుంచి బాల్‌ కొట్టి, రెండు పరుగులు తీయాలని భావించానని, కానీ కోరీ క్రాస్-సీమ్ బాల్ వేయడంతో తాను సంతోషంగా దాన్ని కొట్టానని, అనుకోకుండా అది సిక్స్ వెళ్లిపోయిందని తెలిపాడు కోహ్లీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles