ప్లేఆఫ్స్ ముంగిట ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ప్లే-ఆఫ్ కు దూరం కానున్నారన్న వార్త అభిమానుల్లో కలవరానికి కారణమవుతుంది. పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరం కానున్నాడు. అటు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరుగనున్న ప్లే-ఆఫ్ మ్యాచ్ కు వీరిద్దరూ దూరం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వ్యక్తవువతున్నాయి.
అయితే అశీష్ నెహ్రా జట్టుకు దూరమవుతున్నారని సన్ రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించిన ఆయన తొండ కండరం పట్టివేయడంతో ఆయన ఇకపై జరిగే మ్యాచ్ లకు దూరం అవుతున్నారని చెప్పారు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గుజరాత్ లయన్స్ తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ నెహ్రా స్టాండ్స్ కే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ స్టీడ్ స్టర్ మొహమ్మద్ సిరాజ్ పైనే అధిక భారం పడనుంది.
ఇక ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ చిటికెన వేలికి తీవ్రగాయం అయిన విషయం తెలిసిందే. దీంతో గుజరాత్ తో జరిగిన కీలక మ్యాచ్ లోనూ యువీ హుక్ షాట్ కోట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగిన విషయం తెలిసిందే. అయితే అతని ఫిట్ నెస్ కోల్పోయాడని మ్యాచ్ కు దూరంగా వుంటే అవకాశాలే అధికంగా వున్నాయి. కాగా యువరాజ్ సింగ్ బుదవారం ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కానున్నాడు. అందులో సక్సెస్ అయితే.. తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. అయితే అతను అడతాడా లేదా అన్న ఉత్కంఠకు మాత్రం రేపే తెరపడనుండటంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more