గాయంతో ఐపీఎల్ కు అశ్విన్ దూరం.. విజయ్..? Ravichandran Ashwin set to miss IPL 2017

Ravichandran ashwin ruled out of ipl due to sports hernia injury

india vs australia, indian premier league, australia, Team India, KL Rahul Shoulder injury, R Ashwin cricket hernia, Murali Vijay shoulder and wrist injury, IPL, Daredevils coach Dravid, de Kock injury, Ravichandran Ashwin, India cricket, latest sports news, indian cricket team, news, sports, cricket news, cricket

Ravichandran Ashwin, the India offspinner, is set to miss IPL 2017 for Rising Pune Supergiant because of a sports hernia. Vijay too is in danger of missing the tournament for Kings XI Punjab because of a wrist and shoulder injury

గాయంతో ఐపీఎల్ కు అశ్విన్ దూరం.. విజయ్..?

Posted: 03/31/2017 07:02 PM IST
Ravichandran ashwin ruled out of ipl due to sports hernia injury

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి దిగ్గజ అటగాళ్లు దూరం అవుతున్నారు. గాయాలబారిన పడిన వీరు క్రమంగా అత్యంత ఉత్కంఠభరితమైన ఆటకు దూరం కావడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గా అసీస్ సహా పలు జట్లపై సత్తా చాటిన కేఎల్ రాహుల్ తన భుజానికైన గాయంతో ఐపీఎల్ కు దూరం కాగా, ఇప్పుడు అదే భాటలో మరికొందరు టీమిండియా కీలక అటగాళ్లు వుండటం అభిమానుల్ని కలవరానికి గురిచేస్తుంది.

రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్(ఆర్‌పీఎస్) జట్టు సభ్యుడైన స్పీన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా దూరం అవుతున్నాడు. గాయం కారణంగా అశ్విన్ తాజా ఐపీఎల్-10కు దూరం కానున్నడాని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతేడాది ఏర్పడిన పుణే జట్టు తమ తొలి సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అశ్విన్ సేవలు కోల్పోతే ఈ సీజన్‌లో జట్టు విజయాలపై ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అశ్విన్ కానీ, పుణే జట్టుగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆస్ట్రేలియా సిరీస్‌ ముగిసిన అనంతరం ముంబైలో అశ్విన్‌కు పరీక్షలు నిర్వహించి.. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు అశ్విన్ విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో సూచించినట్లు తెలుస్తోంది. జూన్ మాసంలో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వరకు పూర్తిస్థాయిలో అశ్విన్ కోలుకుని భారత జట్టుకు అందుబాటులో వుండాలంటే ఈ విశ్రాంతి తప్పదని సమాచారం.  అయితే ఇందుకు కారణం హెర్నియాగా చెబుతున్నా.. ధోనికి కాకుండా మరోకరికి జట్టు పగ్గాలను అప్పగించడం కూడా కారణం అయ్యివుండవచ్చునన్న పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి.

అటు టీమిండియా మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా తన మడమ, భుజానికి అయిన గాయాలతో ఐపీఎల్ కు దూరం కానున్నాడని సమాచారం. ఇదే జరిగితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కీలక అటగాడిని కొల్పోయినట్లే. ఇదే క్రమంలో ఢిల్లీ ఢేర్ డెలిల్స్ జట్టు కూడా కీలక అటగాడిని దూరం చేసుకుంది. గాయం కారణంగా డీకాక్ ఐపీఎల్ కు అందుబాటులో రాలేడని డేర్ డెవిల్స్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావీడ్ చెప్పారు. ఇలా కీలక అటగాళ్లందరూ ఐపీఎల్ కు దూరం కానుండడంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2017  Ravichandran Ashwin  Murali Vijay  Kings XI punjab  Rising Pune Supergiants  cricket  

Other Articles