అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న స్మిత్ The incident should be investigated, says Steve Waugh

Steve smith shatters records with epic 178 not out versus india in ranchi test

steve smith, australian cricket team, india vs australia, ranchi, Test cricket, glenn maxwell, Michael Clarke, Ricky Ponting, Steve Waugh, Allan Border, Adam Gilchrist, Mark Taylor, Kim Hughes

Steve Smith’s knock of 178 is the highest score by an Australian captain in Tests in India. He beat the previous mark of 130 which was achieved by Michael Clarke in the Chennai Test in 2013.

అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్న స్మిత్

Posted: 03/17/2017 09:04 PM IST
Steve smith shatters records with epic 178 not out versus india in ranchi test

భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్  స్టీవ్ స్మిత్  సరికొత్త ఘనతను సొంతం చేసుకున్నాడు. రాంచీ వేదికగా జేఎస్‌సీఏ స్టేడియంలో భార‌త్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ మ‌రో కొత్త మైలురాయిని అందుకున్నాడు. మ్యాక్స్ వెల్ మిన‌హా మిగ‌తా ఆట‌గాళ్లంతా విఫ‌ల‌మైనా.. స్టీవ్ స్మిత్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తో బాగా రాణించడంతో పాటు తమ జట్టుకు చెందిన ఇతర కెప్టెన్లను మించిపోయాడు. ఇవాళ జరిగిన రోజు ఆటలో ఆయ‌న 130 పరుగుల వ్యక్తిగత స్కోరును దాటడంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాత రికార్డును బ‌ద్దలుకొట్టాడు.

2012-13 సీజన్ లో భారత్ లో క్లార్క్‌ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన విష‌యం తెలిసిందే. ఆ రికార్డునే స్మిత్ దాటేశాడు. అంతేకాదు, భారత్ లో ఒక సిరీస్ లో రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో కెప్టెన్ గా కూడా ఘ‌న‌త సాధించాడు. పుణెలో జ‌రిగిన‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్మిత్ సెంచ‌రీ చేశాడు. దీంతో గ‌తంలో ఈ ఘనతను సాధించిన క్లైవ్ లాయిండ్(1974-75), అలెస్టర్ కుక్(2012-13)ల స‌ర‌సన‌ నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  steve smith  Michael Clarke  australia  india  test series  cricket  

Other Articles

Today on Telugu Wishesh