ధోని కెప్టెన్సీ మార్కు విజయమే.. నేను నేర్చుకుంటున్నా.. learning captaincy tricks from dhoni says kohli

Learning captaincy tricks from dhoni says kohli

ms dhoni, dhoni, ms dhoni wicketkeeping, dhoni captaincy, virat kohli, india vs england, chinnaswamy stadium, banglore, cricket news, sports news, cricket

The load of captaincy off him, MS Dhoni is scoring runs and as Virat Kohli has admitted, is sharing crucial tips from behind the wickets.

ధోని కెప్టెన్సీ మార్కు విజయమే.. నేను నేర్చుకుంటున్నా..

Posted: 02/02/2017 08:03 PM IST
Learning captaincy tricks from dhoni says kohli

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను ఇటీవలే విరాట్ కోహ్లీకి అందించిన మిస్టర్ కూల్ గా పేరొందిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీ రుచి ఎలాంటిదో ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ల సందర్బంగా చూపించాడు. అటు బిసిసిఐ ప్రముఖులతో పాటు ఇటు జట్టు సభ్యులతో పాటు అఖిలభారత క్రికెట్ అభిమానులకు తెలియజేశాడు, అటు ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలను కనిపించేలా చేశాడు. అయితే ధోని అంటే అభిమానం ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.

ధోని నుంచి అనేక అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నట్లు చేప్పాడు. టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనికి అపారమైన కెప్టెన్సీ అనుభవం ఉండటం వల్ల తాను టెక్నిక్స్ను సులభంగా నేర్చుకోవడానికి దోహదం చేస్తుందన్నాడు. దీంతో పాటు కీలక సమయాల్లో కెప్టెన్సీ ఎలా చేయాలి అనే టెక్నిక్ ను ప్రధానంగా ధోని నుంచి తెలుసుకుంటున్నాని తెలిపాడు. ఇది పరిమిత ఓవర్ల క్రికెట్. నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ధోని సలహాలు తీసుకో్వడానికి వెనుకాడటం లేదన్నాడు.

క్లిష్ట సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ధోని ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకునేవాడని కోహ్లి తెలిపాడు. యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్తైన తరువాత తాను నెహ్రాను బౌలింగ్ కు దింపాలనుకున్నానని, అయితే ధోని సలహా మేరకు బూమ్రా చేతికి బంతి ఇవ్వడం జరిగిందన్నాడు. చివరి మూడు బంతుల్లో బూమ్రా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ తొందరగా ముగిసిపోయిందని కోహ్లి అన్నాడు. ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధోనిని ఆశ్రయిస్తున్నట్లు కోహ్లి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles