జనవరి 1న అనుష్కతో కోహ్లీ ఎంగేజ్ మెంట్..? Kohli, Anushka Likely To Get Engaged On Jan 1

Virat kohli anushka sharma likely to get engaged on jan 1

Anushka Sharma, Virat Kohli's girlfriend, new year 2017, virat anushka engagement, virat anushka vacation, virat anushka wedding, virat kohli

Anushka Sharma and Virat Kohli after much denial and speculation, looks like the two have finally decided to get engaged on New Year.

జనవరి 1న అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ఎంగేజ్ మెంట్..?

Posted: 12/29/2016 06:46 PM IST
Virat kohli anushka sharma likely to get engaged on jan 1

టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కొత్త సంవత్సరంలో తన ప్రియురాలు, ప్రముఖ సినీనటి అనుష్క శర్మలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన తన ప్రియురాలితో కలసి ఇప్పటికే ఎంగేజ్ మెంట్ పనుల నిమిత్తంలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో బస చేస్తున్నాడన్న టాక్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. గత ఏడాది ఈ ప్రేమ జంట ఇద్దరికీ బాగా కలసివచ్చింది. విరాట్ టెస్టు క్రికెట్ లో రికార్డులను నమోదు చేయగా, అటు అనుష్క నటించిన పలు చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద హిట్ అయ్యాయి.

దీంతో బ్రేక్ అప్ తరువాత మళ్లీ ఒక్కటైన జంట.. ఇంగ్లాండ్ తో  టీమిండియా వన్డే సిరీస్ కు మధ్య లభించిన సమయాన్ని ఎంచక్కా జాలీగా గడిపేందుకు నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరు ఎంగేజ్ మెంట్ కోసమే ఇక్కడకు వచ్చారని కొత్త ఏడాది ప్రారంభం రోజునే వీరిద్దరు తమ కుటుంబాల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారని వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న వార్తలను బట్టి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని నరేంద్రనగర్ లో గల హోటల్ ఆనందలో వీరి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది.

ఇందుకు వీరిద్దరి ఇస్టాగ్రామ్ అకౌంట్లు కూడా అవునన్న సంకేతాలను వెల్లడిస్తున్నాయి. ఇటీవల క్రిస్టమస్ రోజు విరాట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపగా, అనుష్క మాత్రం తాను జీవితంలో అమితానందాన్ని పోందుతున్నట్లుగా జాతీయ పక్షి నెమలితో వున్న వీడియోను పోస్టు చేసింది. కాగా తాజాగా వీరిద్దరూ కలసి ఓ ఆలయ అర్చకుడితో పాటు దిగిన ఫోటో కూడా నెట్ లో హల్ చల్ చేస్తుంది. అయితే అధికారికంగా మాత్రం వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అది కూడా త్వరలోనే వెలువడుతుందన్న వార్తలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  Virat Kohli  engagement  wedding  uttarakhand  cricket  Sport  

Other Articles