అన్నాడీఎంకే కార్యకర్తలకు మరో తీపి కబురు.. Bangladesh throw-away a fair chance to level the series

New zealand win the series with a game to spare

New Zealand, Bangladesh, Neil Trevor Broom, maiden ODI century, six years, cricket

Neil Trevor Broom having returned to the side after a six-year long lay-off recorded his maiden ODI ton in an innings no other batsmen came out with a sizable score to push New Zealand

ఆరేళ్ల నిరీక్షణకు బ్రేక్.. వన్డేల్లో బ్రూమ్ తొలి శతకం

Posted: 12/29/2016 05:50 PM IST
New zealand win the series with a game to spare

న్యూజిలాండ్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ నీల్ ట్రెవర్ బ్రూమ్ ఆరేళ్లకు తన కలను ఎట్టకేలకు ప్రత్యర్థి బంగ్లాదేశ్ పై నెరవేర్చుకున్నాడు. వన్డే కెరీర్ ఆరంభించి దాదాపు ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు సెంచరీని నమోదు చేయని బ్రూమ్ బంగ్లాదేశ్‌తో నెల్సన్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో తీర్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు వన్డేలు గెలిచిన కివీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టులో ఖాతా తెరవకుండానే ఓపెనర్ గప్టిల్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 37 పరుగుల వద్ద షకీబ్ అల్ అసన్ బౌలింగ్ లో కెప్టెన్ విలియమ్సన్(22) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఇక అక్కడినుంచి బ్రూమ్ అజేయ శతక(109 పరుగులు: 107 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్సర్లు) ఇన్నింగ్స్ కొనసాగించాడు. మరో ఎండ్ లో ఎవరి సహకారం లేకున్నా చివరి వరకూ నిలిచి సెంచరీ సాధించడంతో పాటు న్యూజిలాండ్ కు 251 పరుగుల గౌరవప్రద స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు.

అతడికి నీషమ్(28), రోంచీ(35) నుంచి కాస్త సహకారం లభించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ట్రెంట్ బౌల్ట్ రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులకు అలౌటైనా, సెంచరీ హీరో నీల్ బ్రూమ్ అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం ఆరో వికెట్‌కు మాత్రమే 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు అయింది. బంగ్లా బౌలర్లలో మోర్తాజా 3 వికెట్లు తీశాడు. టస్కీన్ అహ్మద్, షకీబ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  Bangladesh  Neil Trevor Broom  maiden ODI century  six years  cricket  

Other Articles