ఇంగ్లాండ్ స్లెడ్జింగ్ ను టీమిండియా పట్టించుకోదు Saha enjoying friendly Team India dressing room

India won t respond to england s sledging says wriddhiman saha

Anil Kumble, Cricket, England, England in India 2016, England vs India, India, India vs England, Sourav Ganguly, Test cricket, Virat Kohli, Wriddhiman SahaTest cricket, Indian cricket, England cricket, cricket, cricket news, sports, sports news

Wriddhiman Saha insists sledging is not on the agenda against England, while also praising dressing room atmosphere in the current Indian Test cricket team ahead of the crucial home Test series.

ఇంగ్లాండ్ స్లెడ్జింగ్ ను టీమిండియా పట్టించుకోదు

Posted: 11/03/2016 06:21 PM IST
India won t respond to england s sledging says wriddhiman saha

స్వదేశంలో ఈ నెల 9 నుంచి రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో తాము పర్యాటక జట్టు స్లెడ్జింగ్ కు ఏ మాత్రం స్పందించబోమని వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అన్నాడు. వారి స్లెడ్జింగ్ కు తాము స్పందించిన పక్షంలో వారు దానినే అవకాశంగా తీసుకుని మరింతగా రెచ్చిపోయి భారత విజయాన్ని దెబ్బతీసే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సాహ మాట్లాడుతూ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు స్పష్టం చేశాడు.  

తన రంజీ జట్టు బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంతో మెరుగ్గా ఉంటుందన్నాడు. బెంగాల్ జట్టుకు ఆడుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో చాలా గంభీరమైన వాతావరణం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ తరహా వాతావరణం తనకు అంతగా నచ్చదని సాహా చెప్పాడు. అదే సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అందుకు భిన్నంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు.

ఇక విరాట్ కోహ్లి, ధోనిలపై సాహా ప్రశంసలు కురిపించాడు. ధోని, కోహ్లిల్లో ప్రతీ మ్యాచ్లో విజయం సాధించాలని కోరిక అమితంగా ఉంటుందన్నాడు. దానికోసం తమ శాయశక్తులా పోరాడతారని సాహా కొనియాడాడు. విరాట్, ధోని కెప్టెన్సీ విషయాల్లో పెద్దగా తేడా లేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందన్నాడు. ముఖ్యంగా ఆన్ ఫీల్డ్లో ధోని కూల్గా ఉండటంతో పాటు మితంగా మాట్లాడితే, కోహ్లి మాత్రం చాలా దూకుడుగా ఉంటాడని పేర్కొన్నాడు. తన భుజాలపై ఆవేశాన్ని ధరించి వచ్చినట్లు కోహ్లి కనబడతాడన్నాడు

అయితే ఒకసారి మ్యాచ్ ముగిసిపోయిందంటే కోహ్లి అంత ఫ్రెండ్లీగా మరొకరు ఉండరన్నాడు. ఒక రోజు ఆట ముగిసిపోయిన తరువాత కోహ్లిని చూస్తే ఇప్పటివరకూ ఫీల్డ్లో ఉన్న వ్యక్తేనా ఇలా ఉన్నాడని  అనిపిస్తుందన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరితో చాలా సన్నిహితంగా  కలిసిపోయే వ్యక్తిత్వం కోహ్లిదన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ చాలా కూల్గా మాట్లాడుతూ కొన్ని సూచనలు చేస్తూ తన అనుభవాన్ని మాతో పంచుకుంటాడని సాహా అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  ms dhoni  rajkot  wriddhiman saha  cricket  

Other Articles