తొలిటెస్టులో పర్యాటక జట్టుకు అతిధ్యజట్టు చుక్కలు AUSTRALIA DOMINATES ON DAY ONE

Australia dominates on day one

Australia, Australia vs South Africa, Cricket, Dale Steyn, Faf du Plessis, Kagiso Rabada, Mitchell Starc, South Africa, South Africa vs Australia, Steve Smith, Test cricket, Australia cricket, south africa cricket, cricket, cricket news, sports, sports news

Brilliant stuff from Warner, fearlessly taking on the South African quicks. He's 73 not out, Shaun Marsh is 29 not out.

తొలిటెస్టులో పర్యాటక జట్టుకు అతిధ్యజట్టు చుక్కలు

Posted: 11/03/2016 05:29 PM IST
Australia dominates on day one

అతిథ్య జట్టు అస్ట్రేలియాపై వన్డే సిరీస్ తరహాలో దుమ్మరేపి.. వన్డే సిరీస్ తో పాటుగా టెస్టు సిరీస్ ను కూడా క్లీన్ స్వీస్ చేసి తమ దేశానికి సగర్వంగా వెళ్లాలనుకున్న పర్యటక జట్టు దక్షిణాఫ్రికా ఆశలు పెర్త్ టెస్టులోనే అడియాశలయ్యాయి. వన్డే సిరీస్‌లో 5-0తో దారుణ ఓటమితో స్వేదేశీ అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కోన్న ఆస్ట్రేలియా.. టెస్టుల్లో సఫారీలపై ప్రతీకారం తీర్చుకునే దిశగా సాగుతోంది. కోవాలని చూస్తోంది.

పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో సఫారీలకు కంగారులు చుక్కులు చూపించారు. అటగాళ్ల ప్రతిభకు కొలమానంగా వున్న టెస్టు క్రికెట్ లో అసీస్ సఫారీలను కంగారు పెట్టిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్, హాజిల్ వుడ్ వీరవిజృంభన చేయడంతో అసీస్ 242 పరుగులకే చాపచుట్టేసింది. డీకాక్, బవుమా మినహా జట్టులో ఎవరూ రాణించలేదు.  

సఫారీలకు అదిలో కస్టాలు ప్రారంభమయ్యాయి. ఖాతా తెరవకుండానే కుక్ డౌకౌట్ గా వెనుదిరిగాడు. స్టా్ వేసిన బంతిని మార్ష్ కు క్యాచ్ ఇవ్వడంతో పెవీలియన్ కు వెళ్లక తప్పలేదు. 32 పరుగులకే సఫారీ జట్టు టపార్డర్ ను పెవిలియన్ బాట పట్టించడంలో అసీస్ బౌలర్లు సఫలీకృతులయ్యారు. ఆ తరువాత డీకాక్ అర్థ సెంచరీతో రాణించి 84 పరుగులు సాధించగా, అయనకు బావుమా మంచి సహకారం అందించి అర్థశతకాన్ని నమోదు చేశారు. దీంతో లంచ్ సమయానికి పటిష్టంగా కనిపించిన సఫారీలు.. టీ విరామ సమయానికి  7 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించారు. ఆ తరువాత టెయిల్ ఎండర్లు కూడా అంతగా రాణించలేకపోవడంతో.. సఫారీలు మొత్తంగా 242 పరుగులు వద్ద ఆలౌట్ అయ్యారు.

ఈ క్రమంలో అసీస్ బౌలర్ స్టార్క్ కు నాలుగు వికెట్లు లభించగా, హాజిల్ వుడ్ కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన అసీస్ ధాటిగా అడుతోంది, వికెట్ కూడా నష్టపోకుండా 105 పరుగులను సాధించింది. వార్నర్ ఒక్కడే 73 పరుగులను సాధించి తమ జట్టును భారీ స్కోరు దిశగా పయనింపజేస్తున్నారు. వార్నర్ కు జతగా వచ్చిన మార్ష్ కూడా 29 పరుగుల వద్ద కోనసాగుతున్నాడు. దీంతో అసీస్ 137 పరుగులు సాధిస్తే తొలి ఇన్నింగ్స్ లో సఫారీల స్కోరును సమంగా నిలుస్తారు. అయితే పది వికెట్లు చేతిలో వున్నందున అసీస్ మరింత రెచ్చిపోయి అడతారనడంలో సందేహమేమీ లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  Peter Siddle  Australia  South Africa  perth test  cricket  

Other Articles