Dhoni heartbroken after one-run defeat in 489-run thriller

Wrong execution leads to 1 run defeat against west indies ms dhoni

India vs West Indies, India vs West Indies T20 in Florida, MS Dhoni, team india, seecond rank in t20, Virat Kohli, West Indies-India, Samuel Badree, KL Rahul, Team India in USA,

MS Dhoni, the India captain, has called for improvement while bowling in the first six overs and has asked his bowlers to assess conditions quickly

అలోచన కరెక్టే.. అచరించడంలో తడబాడ్డాం..

Posted: 08/28/2016 12:47 PM IST
Wrong execution leads to 1 run defeat against west indies ms dhoni

వెస్టిండీస్తో జరిగిన తొలి టీ 20లో ఒక పరుగు తేడాతో ఓటమి పాలుకావడంలో షాట్ సెలక్షన్ను సరిగా అమలు చేయకపోవడమేనని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో థర్డ్ మ్యాన్ దిశగా ఆడాలనుకున్న ఆలోచన కరెక్ట్గానే ఉందని, కానీ ఆ షాట్ను సరిగ్గా అమలు చేయకపోవడంతో పరాజయం చెందినట్లు ధోని అభిప్రాయపడ్డాడు.  ఈ ఉత్కంఠ భరితపోరులో టీమిండియా సానుకూల ధోరణితోనే ముందుకు సాగిందన్నాడు.
 
'ఇదొక అద్భుతమైన గేమ్. బ్యాటింగ్ యూనిట్ నుంచి ఇంతకన్నా ఆశించలేం. చివరి బంతికి మా అంచనా కాస్త తారుమారైంది. దీంతో పరాజయం చెందాం. మిగతా గేమ్ అంతా నిజంగా సూపర్' అని ధోని తెలిపాడు. ఇరు జట్లు మధ్య చివరి వరకూ రసవత్తరంగా సాగిన పోరులో వెస్టిండీస్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి ధోని అవుట్ కావడంతో విండీస్ను విజయం వరించింది. 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పోరాడి ఓడింది.

ఈ మ్యాచ్లో భారత ఆటగాడు కేఎల్ రాహుల్(110) పరుగులతో మెరిశాడు. కొత్తగా జట్లులోకి వచ్చినా.. తాను పూర్తి సామర్ధ్యం కలిగిన వాడిలా రాహుల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడి తన సత్తాను చాటాడని ధోని కొనియాడారు. దీంతో టీ 20ల్లో తొలి సెంచరీ చేయడమే కాకుండా, భారత తరపున మూడో సెంచరీ చేసిన ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. టీ 20ల్లో భారత్ తరపున రాహుల్ సాధించింది అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team india  execute  third man area  india  west indies  ms dhoni  cricket  

Other Articles