New Indian coach should have a grasp of Indian culture says Dhoni

Bcci will decide on my future says ms dhoni

india coach, ms dhoni india, india ms dhoni, dhoni india coach, ravi shastri, sandeep patil, dhoni coach india cricket, cricket news, cricket

“It’s not like I’m not enjoying the game. But it’s a decision that the BCCI will take. It’s not up to me to decide that,” Dhoni told reporters

కెప్టెన్సీపై తేల్చాల్సంది బిసిసిఐ.. కోచ్ కు సంస్కృతి తెలియాలి..

Posted: 06/08/2016 08:08 PM IST
Bcci will decide on my future says ms dhoni

భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వచ్చే వ్యక్తి దేశంలోని క్రీడా సంస్కృతిని తప్పక అర్థం చేసుకోవాలని వన్డే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ‘కోచ్‌గా వచ్చే వ్యక్తికి హిందీ తెలిసుండాలనన్నది ఎప్పుడూ సమస్య కాదు. కాకపోతే మన సంస్కృతిని అర్థం చేసుకునే వ్యక్తి కోచ్‌గా ఉంటే మంచిది’ అని ధోని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ మార్పు విషయంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించిన ఆయన తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని స్పష్టం చేశాడు. తాను కెప్టెన్గా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తాను నిర్ణయించలేనని, బోర్డే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు.

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్గా ధోనీ రిటైరయ్యాక విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా టి-20, వన్డే ఫార్మాట్లలో ధోనీ సారథ్యం వహిస్తున్నాడు. ధోనీ వయసు (35), 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్సీ మార్పు గురించి ఆలోచించాలని, విరాట్కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ధోనీ మాట్లాడుతూ.. 'వచ్చే ప్రపంచ కప్నకు ఇంకా సమయముంది. ఈలోపు మార్పులు జరగవచ్చని భావిస్తున్నా' అని చెప్పాడు.

ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించడం ఓ భిన్నమైన అనుభవమని జింబాబ్వే పర్యటనకు బయలుదేరే ముందు మహీ వ్యాఖ్యానించాడు. ఈ సవాలును ఎదుర్కోవడంపై దృష్టిసారించానని చెప్పాడు.జింబాబ్వే వెళ్లే జట్టులో బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం కనిపిస్తోందన్నాడు. ‘పేపర్ మీద బౌలింగ్ బలంగా ఉంది. బుమ్రా, బరీందర్ బాగా మెరుగయ్యారు. అక్షర్ పటేల్, చాహల్‌లకు వన్డేలు ఆడిన అనుభవం ఉంది. జయంత్ కూడా జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్‌లో అయితే ప్రతి ఆటగాడికి ఓ స్లాట్ అందుబాటులో ఉండాలి.
 
భారత్‌కు ఆడాల్సి వచ్చినప్పుడు మనం అనుకున్న స్థానం దొరకదు. కానీ దొరికిన స్థానంలో కుదురుకోవడానికి ప్రయత్నించాలి. అవగాహన, మార్పు అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ప్రస్తుతానికైతే బ్యాటింగ్, బౌలింగ్ రెండు బాగానే కనిపిస్తున్నాయి’ అని మహీ వివరించాడు. ఐపీఎల్... అంతర్జాతీయ క్రికెట్‌తో ఎప్పటికీ సరిసమానం కాదని ధోని పునరుద్ఘాటించాడు. నైపుణ్యాన్ని గుర్తించడానికి ఓ వేదికగా మాత్రమే పనికొస్తుందన్నాడు. ఈ నెల 11 నుంచి జరిగే సిరీస్‌లో భారత్... మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbabwe  Mahendra Singh Dhoni  team india coach  indian culture  captaincy  

Other Articles