9 runs conceded by mustafizur the most economical four over spell so far in ipl 2016

Mustafizur rahman record economical spell in ipl

indian premier league, ipl 2016, ipl 9, Sunrisers Hyderabad, Kings Punjab, Mustafizur Rahman, sun risers hyderabad bowler, Mustafizur Rahman economical figure, Mustafizur Rahman ipl record

sun risers hyderabad bowler Mustafizur Rahman stole the show with most economical figures of 2-9 through his four overs.

ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత బౌలింగ్ గణాంకాలు

Posted: 04/24/2016 11:33 AM IST
Mustafizur rahman record economical spell in ipl

ఐపిఎల్ 9  బాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్  రైజర్స్ హైదరాబాద్ కు కింగ్స్ పంజాబ్ కు మద్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు బౌలర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుత మైన బౌలింగ్ తో అరుదైన రికార్డు ను నెలకొల్పాడు. ఐపీఎల్ లోనే ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుతమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ముస్తాఫిజుర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక మేడిన్ ఓవర్ సాయంతో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్ ను కట్టడి చేశాడు.

అంతేకాదు ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన నాలుగు ఓవర్లలో షాన్ మార్ష్,  నిఖిల్ నాయక్ లను పెవిలియన్ కు పంపి రెండు వికెట్లు సాధించాడు.దీంతో ఈ టోర్నీలో ముస్తాఫిజుర్ అత్యుత్తమ ఎకానమీ రేటును నమోదు చేశాడు. ఇదిలా ఉండగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వరుస వైఫల్యాలతో సతమవుతున్న కింగ్స్ పంజాబ్కు ఈ మ్యాచ్లోనూ శుభారంభం లభించలేదు.  

ఓపెనర్ మురళీ విజయ్(2) ఆదిలోనే పెవిలియన్ చేరి నిరాశపరచగా, మరో ఓపెనర్ వోహ్రా(25) కాస్త ఫర్వాలేదనిపించాడు. ఆ తరువాత షాన్ మార్ష్(40;34 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు), నిఖిల్ నాయక్(22; 28 బంతుల్లో 1ఫోర్),  అక్షర్ పటేల్(36; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. పంజాబ్ మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ డేవిడ్ మిల్లర్(9),  మ్యాక్స్వెల్(1) లు ఘోరంగా విఫలం అయ్యారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl 2016  ipl 9  Sunrisers Hyderabad  Kings Punjab  Mustafizur Rahman  

Other Articles