Ashish Nehra's stunning comeback for India doesn't make me regret retirement, says Zaheer Khan

Zaheer khan says he doesnt regret his decision to retire

ashish nehra, team india, zaheer khan, stunnig comeback, delhi dare devils, regrets, international cricket, retirement decision, IPL, indian premium league, asia cup, t20 world cup

Former pace spearhead Zaheer Khan, who will captain Delhi Daredevils said that he has no regrets about retiring from the international cricket after his former new-ball partner Ashish Nehra, 37, made a stunning international comeback after a lengthy gap of four years.

తాను తీసుకున్న నిర్ణయంపై బాధ లేదన్న జహీర్

Posted: 04/06/2016 07:50 PM IST
Zaheer khan says he doesnt regret his decision to retire

టీమిండియా సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా నాలుగేళ్లు తరువాత మళ్లీ జట్టులో స్థానం సంపాదించి అటు అసియాకప్ లోనూ ఇటు టీ 20 వరల్డ్ కప్ లోనూ తన సత్తా చాటడంతో పాటు లేటు వయసులో అదరగొడుతున్నాడు. 36 ఏళ్ల నెహ్రా అద్బుతమైన ప్రతిభతో సత్తాచాటి శభాష్ అనిపించుకుంటున్న నేపథ్యంలో టీమిండియా మాజీ స్పీడ్ స్టర్, పేసర్ జహీర్ ఖాన్ ను కూడా ప్రశంసించాడు, నెహ్రా పునరాగమన ఇన్నింగ్స్  తనకు స్ఫూర్తినిచ్చిందని జహీర్ చెప్పాడు. ఫామ్ టాలెంట్ వుంటే రాణించగలమని దానికి వయస్సులో పనిలేదని కూడా చెప్పాడు,

అయితే నెహ్రా తరహాలో అందరూ రాణించగలరని తాను భావించడం లేదన్నాడు. ముఖ్యంగా తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినందుకు బాధగా లేదని 37 ఏళ్ల జహీర్ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఆడనున్న జహీర్ ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 'అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నేను తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. దీనికే కట్టుబడి ఉంటాను. నెహ్రా రాణించినందుకు సంతోషంగా ఉంది.

నాకు స్ఫూర్తి కలిగించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నా. యువ బౌలర్లకు సలహాలు ఇస్తూ సీజన్ను ఆస్వాదిస్తా' అని జహీర్ అన్నాడు. ఐపీఎల్ వల్ల బౌలర్లకు పెద్దగా ఉపయోగం ఉండదని జహీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రదర్శనతో బౌలర్లు అంతర్జాతీయ వన్డేలు, టెస్టులకు ఎంపిక కావడం కష్టమని చెప్పాడు. బౌలర్లకు భిన్నమైన నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టులతో పోలిస్తే టి-20 ఫార్మాట్ పూర్తిగా భిన్నమైదని అన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  India  ashish nehra  zaheer khan  team india  retirement decision  

Other Articles