India favourites in WT20 semi against West Indies

India bank on spin to dismantle windies heavy weapons

india vs west indies, ind vs wi, india west indies, india vs wi prediction, ind vs wi 2016, india vs west indies live, ind vs wi live, india vs west indies cricket, india vs west indies live score, india vs west indies live updates, india vs west indies semifinal, ind vs wi semifinal, cricket live, live score, cricket news, cricket score, cricket

Team India made every minute count during the training session on the eve of the semifinal clash against West Indies here at the Wankhede Stadium

కీలక సమరానికి ‘సై’ అంటున్న టీమిండియా, విండీస్.. గెలుపెవరిదీ..?

Posted: 03/31/2016 05:03 PM IST
India bank on spin to dismantle windies heavy weapons

ప్రపంచ కప్ టీ 20 లో భాగంగా ఇవాళ ముంబయిలోని వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న రెండు సెమీ ఫైనల్స్ సమరానికి ఇరు జట్టు సన్నధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో విజయాన్ని అస్వాధించి, ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో తలపడేందుకు రెండు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నుతున్నాయి. టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన ఆరంభ మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో పరాజయం పోంది, అక్కడి నుంచి సత్తా చాటుకుంటూ వచ్చిన టీమిండియా అన్ని మ్యాచ్ లలో నెగ్గి సెమీస్ కు చేరింది.

కాగా వెస్టీండీస్ మాత్రం సమఉజ్జీలైన అన్ని జట్లపై గెలుపోంది.. చివరకు పసికూన అప్ఘనిస్తాన్ చేతిలో మాత్రం ఓటమిని చవిచూసింది. అయితే అప్పటికే సెమీస్ లోకి తన స్థానాన్ని ఖాయం చేసుకోవడంతో ఆ మ్యాచ్ ఫలితం ఆటపై పెద్ద ప్రభావాన్ని చూపలేదు. దీంతో వరుసగా మూడు మ్యాచులు గెలిచి చివరి మ్యాచ్ లో ఓడిన విండీస్ ఇవాళ ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో టీమిండియాతో తలపడేందుకు సన్నధమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లకు విజయావకాశాలు వున్నాయి.

అయితే టీమిండియా ఓపెనర్లు, సురేష్ రైనా చక్కని ఫామ్ ను అందుకుంటే.. ఇప్పుడున్న భారత జట్టును ఓడించడం ఎవరి తరం కాదన్న వాదనలు వున్నాయి. ఇప్పటికే టీమిండియా ఓపెనర్లతో పాటు సురేష్ రైనా ప్రదర్శనపై భారత క్రికెట్ అభిమానుల్లో విమర్శలు వెల్లువెతుతున్నాయి, ప్రపంచ కప్ ప్రారంభం నుంచి వీరు ముగ్గురిలో ఎవరూ సరిగా రాణించలేదని క్రికెట్ విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్ వంటి జట్లతో పరాజయం అంచులకు వెళ్లిన మ్యాచ్ ను చాకచక్యంగా విజయతీరాలకు చేర్చాల్సిన అవసరం రావడం కూడా భారీ స్కోరును సాధించలేకపోవడమేనన్న విమర్శలు కూడా వినిసిస్తున్నాయి.

భారత్‌తో జరగబోయే సెమీస్‌లో తన ఫోకస్ అంతా బౌండరీ లైన్ పైనేనని వుంటుందని ఇప్పటికే స్పష్టం చేసిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తన పేరున మరో రికార్డును లిఖించుకునేందుకు సిద్దమయ్యాడు. ఆయనతో పాటు టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా రికార్డును క్రియేట్ చేసే పనిలో వున్నాడు. భారత్ తో జరగనున్న సెమీ ఫైనల్స్ లోనూ చెలరేగి ఆడటమే తన లక్ష్యమని తేల్చిచెప్పిన గేల్.. ఇవాళ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కసీనం ఈ మ్యాచ్ లోనైనా టీమిండియా తమ స్థాయికి తగిన ఆటను అడుతుందో లేదో వేచి చూడాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  Ashish Nehra  ms dhoni  Chris Gayle  West Indies  

Other Articles