Australia messed around with team selection too much: Shane Warne

Shane warne blasts australia s world t20 team selection

india vs australia, ind vs aus, india australia, india vs australia t20, virat kohli, kohli, aaron finch, finch, shane warne, warne, cricket australia, australia cricket, cricket news, cricket

Shane Warne didn't agree with the decision to leave out Aaron Finch, who had opened batting with David Warner in 12 T20Is.

వాళ్ల నిర్ణయాలే జట్టు పరాజయానికి కారణం..

Posted: 03/31/2016 05:00 PM IST
Shane warne blasts australia s world t20 team selection

టీ20 వరల్డ్ కప్లో అస్ట్రేలియా ఓటమికి తమ జట్టు సెలక్టర్లే కారణమంటూ వారిని తూర్పరబట్టాడు స్పిన్ లెజెండ్ షేన్ వార్న్. భారత్పై ఓడి ఇంటిదారి పట్టిన ఆస్ట్రేలియా జట్టు సెలక్టర్ల తీరుపై ఆయన మండి పడ్డారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆరోన్ ఫించ్, బౌలర్ హేస్టింగ్స్లను కొన్ని మ్యాచ్లలో జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని వార్న్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం తీసుకున్న కోచ్ డారెన్ లెమన్, సెలక్టర్ మార్క్వా తీసుకున్న నిర్ణయాలే జట్టు విజయావకాశాలను దెబ్బతీశాయని వార్న్ ఆరోపించారు.
 
న్యూజీలాండ్, బంగ్లాదేశ్లతో జరిగిన మ్యాచ్లలో ఫించ్ను ఆసీస్ పక్కనబెట్టిన విషయమై స్పందించిన ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్లను ఎలా పక్కనబెడతారని ప్రశ్నించారు. టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లతో ఆరోన్ ఫించ్ ఒకరని.. ఈ విషయం మనకు ఐసీసీ ర్యాంకింగ్స్ను చూసినా తెలుస్తోందన్నారు. అలాంటిది వరల్డ్ కప్లోని మ్యాచ్లలో ఫించ్ను ఆడించకపోవడం మిగతా జట్టుపై ప్రభావం చూపింది' అన్నారు.

వార్నర్, ఫించ్లు బెస్ట్ ఓపెనింగ్ జోడి అని లోకమంతా కితాబిస్తున్నా.. మన సెలక్టర్లు మాత్రం ఆ జోడీని విడగొట్టి జట్టు పరాయజయానికి కారణమయ్యారని మండిపడ్డారు, వరల్డ్ కప్లో కూడా ఇదే జోడీని కంటిన్యూ చేయాల్సి ఉండేదని వార్న్ అభిప్రాయపడ్డారు. అలాగే టీ20 లలో యార్కర్ బంతులు విసురుతూ చెలరేగేపోయిన బౌలర్ హేస్టింగ్స్ను పక్కనబెట్టి పాకిస్తాన్, ఇండియాలతో జరిగిన మ్యాచుల్లో హెజిల్ వుడ్ను ఆడించడం పట్ల కూడా పరాజయానికి కారణాలుగా వార్నర్ చెప్పుకోచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  Shane warne  Aaron Finch  hastings  India  australia  semi finals  cricket  

Other Articles