Shane Watson to consider retirement after tournament

Shane watson to think about retirement after world t20

icc world t20, world t20 scores, world t20 news, world t20 updates, shane watson australia, shane watson, shane watson retirement, watson hundred, watson runs,sports news, sports, cricket news, cricket

Shane Watson has a golden opportunity to bow out of the international arena by winning the one global trophy that has eluded Australia.

టీ20 కప్ తరువాత క్రికెట్ కు వాట్సన్ గుడ్ బై..

Posted: 03/09/2016 07:37 PM IST
Shane watson to think about retirement after world t20

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో అల్ రౌండర్ రిటైర్ కానున్నారు. అస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ త్వరలో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా వాట్సన్ వెల్లడించి అభిమానులను కలవరానికి గురిచేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్లు చెప్పాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో భారత్ తో జరిగిన టీ20 సిరీస్ తో ఆస్ట్రేలియా జట్టులోకి వాట్సన్ తిరిగి ప్రవేశించాడు.

ఈ సిరీస్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శించిన వాట్సన్ టీ20 వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ఆసీస్ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాగా, 2007 నుంచి టీ20 కప్ ను సొంతం చేసుకోవాలన్న ఆసీస్ కల నెరవేరట్లేదని, ఈసారైనా తాము గెలిస్తే బాగుంటుందని, క్రికెట్ కు తాను గుడ్ బై చెప్పే సందర్భం మరింత జ్ఞాపకాన్ని మిగులుస్తుందని వాట్సన్ అన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shane watson  australia  icc world t20  retirement  

Other Articles