Mohammad Amir's Video Used By International Cricket Council to Warn Players About Corruption

Amir made video to educate cricketers against graft

ICC Anti-Corruption Unit chairman, Sir Ronnie Flanagan, Pakistan pacer Mohammed Amir, Mohammad Asif, Salman Butt, Ronnie Flanagan, Cricket, World T20,

Mohammad Amir features in an International Cricket Council video which is aimed at education players about the consequences of fixing. Amir recently returned from his five year ban for spot-fixing

వరల్డ్ కప్ క్రికెటర్లకు అమిర్ వీడియో ప్రదర్శన

Posted: 03/07/2016 01:27 PM IST
Amir made video to educate cricketers against graft

ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ లో క్రికెటర్లు ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడకుండా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యోచిస్తుంది. ఇందులో భాగంగా క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడి.. దానిని అంగీకరిరచి ఐసిసీ విధించిన శిక్షను అనుభవించిన క్రికెటర్ల జీవితాలను, నేరం అంగీకార సమయంలో తీసిన వీడియోను క్రికెటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఐసీసీ-అవినీతి నిరోధక శాఖ ఓ వీడియోని ఆటగాళ్లకి చూపించేందుకు సమాయత్తమైంది.

పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ మహ్మద్‌ ఆమిర్‌ కెరీర్‌ వూపందుకుంటున్న తరుణంలో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని.. తప్పు చేశానని ఒప్పుకోవడంతో పాటు.. క్షమించమని అభిమానుల్ని బహిరంగంగా వేడుకున్న వీడియోను క్రికెటర్లకు చూపనున్నారు. నిషేధ సమయంలో పశ్చాతాపంతో అతను బాధపడిన సందర్భ వీడియోని క్రికెటర్లకు చూపించాలని ఐసీసీ భావిస్తోంది. దీంతో క్రికెటర్లలో అవగాహన పెరగడంతో పాటు అవినీతికి పాల్పడితే ఎలాంటి చర్యలు, అవమానాలు ఉంటాయో తెలిసొచ్చేలా చేయచ్చని ఐసీసీ యోచిస్తోంది. నిషేధం అనంతరం పాక్‌ జట్టులోకి మళ్లీ వచ్చిన ఆమిర్‌ ఆసియా కప్ లో ఆకట్టుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Amir  International Cricket Council  Cricket latest Cricket news  

Other Articles