Pakistan spinner Yasir Shah suspended for doping - ICC

Yasir shah provisionally suspended by icc after positive test

Pakistan,Yasir Shah,International Cricket Council,Cricket Pakistan Leg-Spinner Yasir Shah Banned After Failing Doping Test latest Cricket news

The International Cricket Council today announced that Pakistan’s bowler Yasir Shah has been charged with an anti-doping rule violation under the ICC Anti-Doping Code.

పెరీరా తరువాత డోపింగ్ లో దొరికిన యాసిర్ షా.. నిషేధం

Posted: 12/27/2015 05:29 PM IST
Yasir shah provisionally suspended by icc after positive test

క్రికెట్ ప్రపంచంలో తాము ఒకరై వుంటూనే.. ఉత్రేరకాలు తీసుకుంటూ తమతో పాటు తమ దేశాలకు కూడా అపఖ్యాతి పాలు చేస్తున్నారు పలువురు క్రికెటర్లు. శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ కుశాల్ పేరారాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకుని 48 గంటలు కూడా గడవకముందే..మరో క్రికెటర్ అదే తరహా అభియోగాలను నిరూపితం కావడంతో క్రికెట్ నుంచి నిషేదానికి గురయ్యాడు. అతడే పాకిస్థాన్ కు చెందిన లెగ్ స్పిన్నర్ యాసిర్ షా.

ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో అల్లాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ లో మరో కలకలం రేగింది. పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో  అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. గత నెల 13 వ తేదీన యాసిర్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు  తేలడంతో అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.' యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్  క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడమే. దీంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. దీనిపై యాసిర్ అప్పీల్ చేసుకునే వీలుంది'  అని ఐసీసీ పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yasir Shah  ICC  pakistan  banned  doping  

Other Articles