Bottle-throwing incidents not good for the game, says Sachin Tendulkar

Sachin tendulkar urges fans to show maturity after cuttack incident

Sachin Ramesh Tendulkar,Barabati Stadium, Cuttack,South Africa in India Series, 2015,Cricket India vs South Africa: Sachin Tendulkar Urges Fans To Show Maturity After Cuttack Incident latest South Africa in India Series, 2015 news, cricket, sachin tendulkar, team india, south africa, south africa tour of india 2015, cuttack

Sachin Tendulkar feels unruly crowd behaviour during the Cuttack T20 was not good for the sport and exhorted the fans of the "gentleman's" game to learn from the forgettable incident.

అభిమానులు మరికోంత పరిపక్వతను ప్రదర్శించాలి

Posted: 10/07/2015 06:33 PM IST
Sachin tendulkar urges fans to show maturity after cuttack incident

టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ దేశీయ క్రికెట్ అభిమాన ప్రపంచంపై మండిపడ్డారు. దేశీయ క్రికెట్ అభిమానులు కటక్ స్టేడియంలో వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అభిమానులు ఎందుకిలా ప్రవర్తించారంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. జెంటిల్ మెన్ గేమ్ గా అభివర్ణించబడుతున్న క్రికెట్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించరాదని చెప్పారు. కటక్ లో జరిగిన సౌత్ అఫ్రికా- టీమిండియా జట్ల మధ్య రెండో టెస్టును భారత్ ఓటమిపాలవుతున్న సమయంలో టీమిండియా క్రికెట్ అభిమానులు సఫారీ ఆటగాళ్లపై బాటిళ్లలను విసిరి వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ మధ్యలో రెండు పర్యాయాలు నిలిచిపోయింది. ఆ తరువాత మ్యాచ్ ఆడినా టీమిండియా ఓటమిపాలయ్యింది.

అయితే ఈ ఘటనపై నిదానంగా స్పందించిన సచిన్.. అభిమానులు మరికోంత పరిపక్వత పాటించి వుంటే బాగుండేదన్నారు. ఇలాంటి బాటిల్ విసిరే ఘటనలు క్రికెట్ ఆటకు మంచింది కాదని అన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అయితే వాటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని చెప్పారు. అందరికీ క్రికెట్ అంటే ఫాషన్ అని, తాము కూడా క్రికెట్ ను ప్రేమిస్తామని అయితే కొన్ని సందర్భాలలో అసంతృప్తి, తప్పులు చోటుచేసుకుంటాయని, దాంతో ఆటగాళ్లపై ఇలా తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సమంజసం కాదన్నారు. అనేక విధాలుగా అభిమానులు తమ అసంతృత్తిని వ్యక్తం చేయవచ్చని.. కానీ మ్యాచ్ అడ్డుకుని ఆటగాళ్లపై బాటిళ్లు విసిరే పద్దతి సహేతుకం కాదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలను పునావృతం కాకుండా అభిమానులు మరింత పరిపక్వత ప్రదర్శించాలని సచిన్ కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  sachin tendulkar  team india  south africa  south africa tour of india 2015  cuttack  

Other Articles