will play as long as i enjoy the game yuvraj

Yuvraj aims to play another world cup

Yuvraj aims to play another World Cup, cricket, yuvraj singh, ranji trophy, punjab, team india, indian dashing batsman yuvraj, cricket Latest news

Making a comeback into the Indian team might still be a dream albeit a distant one, senior pro Yuvraj Singh today said that he will continue playing the game as long as he is enjoying it.

క్రికెట్ ను అస్వాదించేంత వరకు ఆడుతూనే వుంటా..

Posted: 10/07/2015 06:38 PM IST
Yuvraj aims to play another world cup

క్రికెట్ ఆటను తాను ఆస్వాదించేంత వరకు అడుతూనే వుంటానని భారత డాషిండ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ చెప్పారు. ఫామ్ కోల్పోవడంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన యువరాజ్ దానిని తిరిగి సంపాదించడం కోసం నిత్యం శ్రమిస్తునే వున్నాడు. అయితే ఇప్పటికైతే టీమిండియాలో స్థానం నెరవేరని కలగానే కనిపిస్తున్నా.. ఆడటం మాననని ఆయన తెలిపారు. రంజీ ట్రోపీ గ్రూప్ లీగ్లో పాల్గొనడానికి ముంబై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'క్రికెట్ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే ప్రాణం. ఆటను ఆస్వాదించినంతకాలం ఆడుతాను' అని ఆయన చెప్పారు.

'భారత్ జట్టులో తిరిగి స్థానం సంపాదించడం కోసం ఎదురుచూస్తున్నాను. తనకు మరోసారి టీమిండియాలో స్థానం లభించినా.. తాను ఆటను ఎంజాయ్ చేయడానికే ప్రాధాన్యతను ఇస్తానని చెప్పుకోచ్చారు. రంజీ క్రీడలు అందుకు అవకాశం ఇస్తాయి.కాబట్టి ఈ గేమ్స్లో నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను' అని తెలిపారు. రెండు సార్లు వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజు తదుపరి ట్వంటీ-20 వరల్డ్ కప్కు ప్రకటించే జట్టులో తన పేరు ఉంటుందని ఆశాభావంతో ఉన్నారు. టీమిండియా తరపున దేశం కోసం ఆడటంలో గోప్ప గౌరవం దాగుందని చెప్పాడు. ప్రస్తుతం తాను తన ఆట తీరుకే అధిక ప్రాథాన్యమిస్తున్నట్లు చెప్పాడు. మ్యాచ్, మ్యాచ్ కు తన ప్రతిభ మెరుగుపర్చుకుంటున్నట్లు చెప్పుకోచ్చాడు యూవీ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  indian team  Yuvraj singh  Ranji Trophi  

Other Articles