Australia's oldest cricketer Harold Stapleton dies at the age of 100

Australia s oldest cricketer harold stapleton dies at 100

Australia, Australia's oldest cricketer, Cricket, Australia's Oldest Cricketer Harold Stapleton Dies at 100, harold stapleton, New South Wales, Sydney Test against India, Australian Army in Papua New Guinea, australia, veteran cricketer, latest Cricket news

Harold Stapleton played one first-class match for New South Wales in 1941 before his career was cut short by the World War II. He celebrated his 100th birthday on January 7, during India-Australia Test in Sydney.

అస్ట్రేలియా పాతతరం క్రికెటర్ హారాల్డ్ కన్నుమూత

Posted: 09/24/2015 08:07 PM IST
Australia s oldest cricketer harold stapleton dies at 100

ఆస్ట్రేలియా పాతతరం క్రికెటర్ హారాల్డ్ స్టాప్లెల్టన్(100) కన్నుమూశారు. న్యూసౌత్ వేల్స్ తరపున ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన హారాల్డ్ రెండో ప్రపంచ యుద్ధంతో సైనిక రంగానికి సేవలందించారు. కాగా ఇవాళ ఆయన మృతిచెందినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్ సైట్ పేర్కొంది.  గత జనవరిలో సిడ్నీలో భారత-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆయన 100 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ మ్యాచ్ ను హారాల్డ్ టీవీలో వీక్షించగా..  ఆయనకు సిడ్నీ గ్రౌండ్ స్కోరు బోర్డు ద్వారా సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా) విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా ఓ టీ షర్టును కూడా క్రికెట్ అస్ట్రేలియా సంతకం చేసి బహుమతిగా ఆయనకు అందించింది. ఎన్నో ఆటల్లో నైపుణ్యం ఉన్న హోరాల్డ్ ప్రత్యేకంగా క్రికెట్ నే  ఎంచుకున్నారని న్యూసౌత్ వేల్స్ సీఈవో అండ్రూ జోన్స్ స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయం కావడంతో ఆయన దేశం తరపున ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం రాలేదన్నారు. ఎడమచేతి వాటం ఆటగాడైన హారాల్డ్ ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడినా దేశ క్రికెట్ కు ఎన్నో సేవలందించినట్లు జోన్స్ పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harold stapleton  australia  veteran cricketer  

Other Articles