England vs Australia report: James Taylor century keeps hopes alive

England win by 93 runs against australia

Adil Rashid,Cricket,England VS Australia,Moeen Ali,Old Trafford,England beat Australia,third one-day international,Old Trafford,World champions Australia,Royal London Series,James Taylor's maiden international hundred, James Taylor, maiden international hundred, England vs Australia, third odi

James Taylor's maiden international hundred was decisive as England trounced Australia by 93 runs at Old Trafford to stay in with a chance of winning the Royal London Series.

అసీస్ ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్

Posted: 09/09/2015 05:23 PM IST
England win by 93 runs against australia

విశ్వవిజేతలుగా బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ పర్యటనలో వున్న అతిధ్యజట్టుకు మాంచెస్టర్ వేదికగా  జరిగిన కీలక మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నెగ్గేందుకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. జేమ్స్ టేలర్ తొలి వన్డే సెంచరీకి తోడు, స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తోడడవడంతో ఇంగ్లీషు సేన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. టేలర్ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. రాయ్(63), మోర్గాన్(62) అర్ధసెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్, కుమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్టార్క్, అగార్ ఒక్కో వికెట్ తీశారు. 301 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన స్మిత్ సేన 44 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఫించ్(53), వేడ్(42) మినహా అందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్, అలీ మూడేసి వికెట్లు నేలకూల్చారు. ఫిన్, రషీద్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. జేమ్స్ టేలర్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' అందుకున్నాడు. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలువగా, మూడో మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ వన్డే సీరిస్ లో బోణీ కోట్టింది

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Taylor  maiden international hundred  England vs Australia  third odi  

Other Articles