MS Dhoni makes it to Forbes list with $31 million earnings a year

Dhoni only indian in forbes list of worlds richest athletes

100 highest-paid athletes, Forbes, MS Dhoni, Richest athletes, cricket, Cricketer Mahendra Singh Dhoni, Maria Sharapova, Wayne Rooney, Serena Williams, Andy Murray,Usain Bolt, Forbes magazine's, highest-paid athletes, American boxer Floyd Mayweather, Brazilian footballer Neymar, Manny Pacquiao, Roger Federer, richest sportsperson, Sports

Cricketer Mahendra Singh Dhoni is among Forbes magazine's 100 highest-paid athletes in the world, the only Indian sportsman on the list that has been topped again by American boxer Floyd Mayweather

ప్రపంచ అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో దోని

Posted: 06/12/2015 04:50 PM IST
Dhoni only indian in forbes list of worlds richest athletes

2015 ఏడాదికి గాను ప్రపంచంలో భారీగా సంపాదిస్తున్న వందమంది క్రీడాకారుల జాబితా ప్రకటించింది ఫోర్బ్స్ మేగజైన్. ఈ లిస్టులో భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును చేర్చింది. వందమందిలో 23 స్థానంలో నిలిచారు ధోని. జార్ఖండ్ డైనమెట్‌ ఏడాది సంపాదన మొత్తం 31 మిలియన్ డాలర్లు. వీటిలో మ్యాచ్‌ ఫీజు,ప్రైజ్‌మనీల ద్వారా ఆర్జించింది 4 మిలియన్ డాలర్లయితే, ఎండార్స్‌మెంట్ల ఆదాయం 27 మిలియన్ డాలర్లు. కెప్టెన్‌ గా, బ్యాట్స్‌మెన్‌ గా ధోని విజయాలు ప్రస్తావించింది ఫోర్బ్స్ మేగజైన్. భారత్ క్రీడాకారులెవ్వరూ పాధించలేనంత ఆదాయాన్ని దోని ఒక్కడు మాత్రమే సంపాదించి.. ప్రపంచ అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

కాగా, ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం కొనసాగిస్తున్నాడు అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్. ఏకంగా 300 మిలియన్‌ డాలర్ల సంపాదనతో టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. గతేడాది ఆదాయం కంటే ఇది రెండింతలు. మేవెదర్ నాలుగేళ్లలో మొదటి స్థానంలో కొనసాగడం ఇది వరుసగా మూడోసారి. 160 మిలియన్ డాలర్ల ఆర్జనతో ఫోర్బ్స్ లిస్టులో రెండోస్థానం సంపాదించారు ఫిలిప్పిన్స్ బాక్సర్ పకియావో. 79.6 మిలియన్ డాలర్లతో రియల్ మాడ్రిడ్‌ సాకర్ హీరో రోనాల్డో మూడోస్థానం, సాకర్ హీరో మెస్సీ నాలుగోస్థానం, ఏడాదికి 67 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్న రోజర్ ఫెదరర్ ఐదోస్థానం, నేషనల్‌ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ఆరోస్థానంలో ఉన్నారు. టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ది 13వ ర్యాంకు. ఒకప్పుడు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు.

ఇక జర్మన్ ఫార్ములా వన్ డ్రైవర్ సెబాస్టియన్ 21, టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ 22, సాకర్ ప్లేయర్ రూనీ 34, జమైకన్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 73వ స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ లిస్టులో ఈసారి కేవలం ఇద్దరు మహిళలే చోటు దక్కించుకున్నారు. రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా 29.7 మిలియన్ డాలర్ల ఆదాయంతో 26వ ర్యాంకులో కొనసాగుతోంది. 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ను సొంతం చేసుకున్న అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ 24.6 మిలియన్ డాలర్ల సంపాదనతో ఫోర్బ్స్ లిస్టులో 47 స్థానంలో ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra singh Dhoni  TEAM INDIA  forbes  

Other Articles