india vs bangladesh test cricket match first day summary | shikhar dhawan | murali vijay

India vs bangladesh test cricket match first day summary

india vs bangladesh match, shikhar dhawan, murali vijay, india cricket team, india bangladesh tour, shikhar dhawan innings, shikhar dhawan match, murali vijay news, bangladesh bowlers

india vs bangladesh test cricket match first day summary : Shikhar dhawan had played wonderfull innings in fatullah stadium. He completed 150 runs in just 158 balls. Finally first day of match is over.

తొలిరోజు భారత్ దే పైచేయి.. దూకుడుగా ఆడిన ధావన్

Posted: 06/10/2015 07:14 PM IST
India vs bangladesh test cricket match first day summary

టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య ఫతుల్లా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ చాకచక్యంగా ఆడుతూ భారీ స్కోరువైపు దిశగా జట్టును తీసుకెళ్లారు.

ముఖ్యంగా శిఖర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. మొదట్లో నిదానంగా తన ఆటను ప్రారంభించిన ధావన్.. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. టెస్టు మ్యాచులా కాకుండా వన్డే తరహాలో చెలరేగిపోయాడు. ముందుగా 47 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న ధావన్.. ఆ తర్వాత మరింతగా బంగ్లా బౌలర్లపై చెలరేగిపోయాడు. ఇక ఆట ముగిసే సమయానికి ధావన్ 158 బంతుల్లో 150 (21 ఫోర్లు) పరుగులు చేశాడు. ఇక మురళీ విజయ్ మొదట్లో కొంచెం తడబడినా భారీ స్కోరులో తనవంతు పాత్ర పోషించాడు. ఇతగాడు 178 బంతుల్లో 89 (8 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ తన సొంత గడ్డపై భారత ఓపెనర్లకు పోటీగా బౌలింగ్ చేయలేకపోయింది. ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీయడానికి బంగ్లాదేశ్ ఏకంగా ఏడుగురు బౌలర్లను దించింది. శిఖర్ ధావన్ భీకరమైన బ్యాటింగ్‌కి బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. టెస్ట్‌లోనూ ధావన్ టీ20 ఆటతీరుతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. మ్యాచ్ జరుగుతుండగా పలుమార్లు వర్షం పడటంతో తొలి రోజు నాలుగు గంటల పాటు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండో రోజు మ్యాచ్‌ను అరగంట ముందే ప్రారంభించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs bangladesh  shikhar dhawan  murali vijay  

Other Articles