Bunty Sachdeva | Rohit Sharma | Ritika Sajdeh | personal | met through me

Rohit sharma and ritika sajdeh met through me

ricket, rohit sharma, ritika sajdeh, mumbai, Indian opener Rohit Sharma, engagement, girlfriend Ritika Sajdeh, Twitter accounts, Bunty Sachdeva, Cornerstone Sport & Entertainment, professional engagements, famous celebrities, mumbai Indians captain rohit sharma, Cricket, Rohit Sharma, Ritika Sajdeh, Team India

Bunty Sachdeva, owner of Cornerstone Sport & Entertainment, has been known to handle professional engagements of many famous celebrities, including Rohit Sharma. But in Rohit’s case, it was personal.

రోహిత్ శర్మ, రితికలను కలిపిందెవరో తెలుసా..?

Posted: 06/05/2015 03:58 PM IST
Rohit sharma and ritika sajdeh met through me

ఇండియన్ టాప్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో ఓ ఇంటివాడు అవుతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు రితిక సజ్దేతో రోహిత్ బుధవార రోజున నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరువురి కుటుంబసభ్యలు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక ముంబయిలోని బొరివాలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అరేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణం.. తొలి మెట్టు ఎక్కింది. ఇక మలి మెట్టు పెళ్లి మాత్రమే మిగిలివుండటంతో.. దానిని కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని ఇరువురు కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రోహిత్, రితిక సజ్దేలను కలిపిందెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. బాల్య స్నేహితురాలని రోహిత్ చెబుతున్నప్పటికీ.. వారిద్దరినీ కలిపింది తానేనంటున్నాడు కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ యజమాని బంటీ సచ్ దేవ. ఎందరో ప్రముఖ సెలబ్రిటీలకు వివాహాలు కుదిర్చిన ఈయనే రోహిత్ , రితికలను కూడా కలిపారంటున్నారు. ఇంతకీ బంటీ ఎవరో తెలుసా.. రితికకు సమీప బందువు. సోదరుడి వరుస. అయితే పెళ్లి కుదర్చడం మాత్రం రోహిత్ తనంతంట తానే చేసుకున్నాడట.

తనకు రోహిత్ పదేళ్లుగా తెలుసట. రోహిత్ టీమిండియా జట్టులో చేరకు మునుపటి నుంచే తనకు పరిచయమని, ఆ క్రమంలోనే రోహిత్ ఒక రోజు రితికను తన ద్వారానే కలిశారని చెబుతున్నాడు బంటీ సచ్ దేవ్. అయితే వారిద్దరూ అనుకోకుండా ప్రమలో పడి.. వారి పెళ్లిళ్లకు వారే పెద్దలుగా మారారని, వారే కుదుర్చుకున్నారని చెబుతున్నాడు. తాను రోహిత్ ను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతానని, తాను అభిమానించే వ్యక్తి తమ కుటుంబసభ్యుడు కావడం పట్ల ఆయన సంతోషంలో మునిగితేలుతున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Ritika Sajdeh  Bunty Sachdeva  

Other Articles