South africa thrashed ireland by 201 runs

ICC Cricket World Cup 2015, south africa versus ireland, south africa vs ireland, world cup south africa stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, amla, du plessis Cricket, CWC 2015, south africa CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland cwc 2015, Sports, World Cup Live,

south africa thrashed ireland by 201 runs

పసికూన ఐర్లాండ్ పై సఫారీల సంచలన విజయం

Posted: 03/03/2015 06:22 PM IST
South africa thrashed ireland by 201 runs

ప్రపంచకప్‌ టార్నమెంటులో భాగంగా ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా మైదానంలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సఫారీలు సంచలనాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఐర్లాండ్ పై 201 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.

దక్షిణాఫ్రికా లాంటి బలమైన బౌలింగ్, 412 పరుగుల భారీ టార్గెట్ నేపథ్యంలో ఐర్లాండ్ ఆది నుంచే తడబాటుకు గురై వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 10.2 ఓవర్లు ముగిసే సమయానికి ఐర్లాండ్ 48 పరుగులు చేసి ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాల్‌బర్నీ (58) జట్టు పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కెవిన్ ఓబ్రైన్ (48) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 2, అబాట్ 4, మోర్కెల్ 3, డివిలియర్స్ 1 ఒక వికెట్ తీశారు. కెప్టెన్ డివిలియర్స్ జట్టులోని 8 మందితో బౌలింగ్ చేయించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 12 పరుగుల వద్దే ఓపెనర్ డికాక్ (1) రూపంలో తొలి వికెట్ కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరో ఓపెనర్ ఆమ్లా (159) క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడినా.. క్రమంగా జోరు పెంచుతూ తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స్ లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. మరో బ్యాట్స్ మెన్ డుప్లెసిస్ కూడా తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ తో (109)తో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 247 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆమ్లా 159 వ్యక్తిగత స్కోరు వద్ద ఆండే బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, క్రీజులోకి వచ్చిరాగానే ఫోర్, సిక్స్‌తో రెచ్చిపోయిన డివిలియర్స్ (24) ఆండే మరో అద్భుతమైన డెలివరీతో పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే జట్టు సురక్షిత స్కోరు సాధించి ఉండటం..చేతిలో మరో ఆరు వికెట్లు ఉండటంతో క్రీజులో ఉన్న రొసో (61 నాటౌట్), మిల్లర్ (46 నాటౌట్)లు స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడేశారు. ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడి చివరి 8.3 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మూనీ 1, కెవిన్ ఓబ్రైన్ 1, ఆండే 2 వికెట్లు తీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  amla  du plessis  

Other Articles