Australia regain border gavaskar trophy third test drawn

Australia regain Border-Gavaskar trophy, Border-Gavaskar trophy, melbourne test drawn, australia score day five third test, India score day five, melbourne test india vs australia 2015, third test day five Australia score, melbourne test day five Australia score, Aussies dominate indians, Aussies bowlers dominate indians, India score day five third test, India score day five melbourne test, third test day five India score, melbourne test day five India score, india drawn third test, 2014 australia vs india, 2014 australia vs india third test, aussies vs india melbourne test 2014, 3rd Test, Day 4

Australia declared at 318/9 on the fifth and final day of the third Test match against India at the Melbourne Cricket Ground. Shaun Marsh missed his ton by a whisker, he was dismissed for 99.

డ్రా గా ముగిసిన మెల్ బోర్న్ టెస్టు.. అసీస్ వశమైన సీరీస్..

Posted: 12/30/2014 01:41 PM IST
Australia regain border gavaskar trophy third test drawn

మెల్‌బోర్న్ టెస్టులో నాలుగో రోజు ఆట తీరును అంచనా వేసినట్లుగానే ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. దీంతో ఇప్పటికే రెండు టెస్టు మ్యచ్ లను తమ వశం చేసుకున్న అస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్ ను మరోసారి కైవసం చేసుకుంది. ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ చివరి రోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోణి సేన అనుకున్న విధంగా రాణించలేక పోయింది. ఆదిలోనే టాప్ ఆర్డర్ లోని కీలక ఆటగాళ్ల వికెట్లను చేజార్చుకుని అభిమానుల్లో కలవరం పెంచినా చివరి వరకూ పోరాడి డ్రా ముగించింది.

దీంతో మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో ఫలితం తేలిపోయింది. మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీ సేన 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(54) మరోసారి ఆదుకున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(48) రాణించడంతో జట్టు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడింది. విరాట్-రహానేల జోడి 85 పరుగుల జోడి నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.

కర్ణాటక ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా పంపి టీమిండియా ప్రయోగం చేసింది. అయితే ఆ ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కాస్త నెమ్మదిగా ఆడింది. మ్యాచ్ గంటలోపు ముగుస్తుందనగా టీమిండియా పరుగు వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోవడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. అయితే చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (24), అశ్విన్ (8) జట్టుకు మరమ్మత్తులు చేపట్టి మ్యాచ్ డ్రాలో పాలుపంచుకున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్, హజ్లివుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు నాల్గవ రోజు సాధించిన ఒవర్ నైట్ స్కొరుతో అస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి.. 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు (డిక్లేర్డ్) చేసింది. మార్ష్ 99, రోజర్స్ 69, వార్నర్ 40, వాట్సన్ 17, స్మిత్ 14, హడిన్ 13, హర్రిస్ 21, జాన్సన్ 15, బర్న్స్ 9 పరుగులు చేశారు. లియాన్, హజ్‌లీవుడ్ నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లు ఉమేష్‌యాదవ్, షమీ, ఇషాంత్ శర్మ, అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 530(ఆలౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 318/9 (డిక్లేర్డ్). భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆరు విక్కెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  3rd Test  cricket  melbourne  Border-Gavaskar trophy  

Other Articles