Sunil gavaskar dissatisfied with virat kohli

sunil gavaskar dissatisfied with virat kohli, gavaskar dissatisfied with kohlis aggressiveness, sunil gavaskar dissatisfied kohlis aggression, former indian captain sunil gavaskar, indian cricketer virat kohli, virat kohli disrespected annoying mitchell johnson, virat kohli slammed australian sledging, Australian cricket sledging, australian bowler mitchell johnson, virat kohli says no respect to johnson, spoilt brat kohli disrespect annoying johnson, india vs australia 2014 third test day 3,

sunil gavaskar dissatisfied with virat kohli says kohlis aggression can be counter productive

విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి

Posted: 12/30/2014 12:52 PM IST
Sunil gavaskar dissatisfied with virat kohli

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజున పేసర్ మిషెల్ జాన్సన్‌తో విరాట్ కోహ్లి జగడంపై ఆయన మండిపడ్డారు. ఈ దూకుడు కారణంగా జట్టు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. క్రికెటర్ల ‘మీడియా సమావేశంలో క్రికెట్ గురించే మాట్లాడాలని అందుకు భిన్నంగా... మైదానంలో జరిగిన ఇతర విషయాలను కోహ్లీ ప్రస్తావించడం సబబుకాదని అయన అభిప్రాయపడ్డారు. గ్రౌండ్ లో జరిగిన ఇతర విషయాల గురించి అక్కడే వదిలేయాలి. కోహ్లి మాట్లాడిన విధానం తెలివైనదనిపించుకోదని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

విదేశీ గడ్డపై ఎన్నో ఆటలు ఆడిన సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రవిడ్ ఇంతకంటే కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నారని ఆయన పేర్కోన్నారు. అయితే వారు ఎప్పుడూ కోహ్లీ మాదిరిగా ప్రపర్తించలేదని చెప్పారు. అవతలి వ్యక్తి రెచ్చగొడితే స్పందించడం కరెక్టే అయినా.. వారిపై అదే పనిగా నోరుపారేసుకోవడం సముచితం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 169 పరుగులు చేసిన కోహ్లీ దానిని అప్పుడే మరచిపోయి వుంటే డబుల్ సెంచరీ సాధించి వుండేవాడని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల విరాట్ కోహ్లీ వికెట్ కూడా పడిందని పేర్కోన్నాడు. ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బతీసిందని గవాస్కర్ విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mitchell johnson  sunil gavaskar  india vs australia 2014  

Other Articles