World t20 warm up game preview india vs sri lanka

World T20, World Twenty20, India vs Sri Lanka Match, World Cup 2014, Warm Up Sri Lanka vs India, T20 World Cup Warm up Match, Dhoni.

World T20 warm-up game preview: India Vs Sri Lanka

సమరానికి నేడే సై..టీ20 ప్రపంచకప్ లో ఎవరిని ఆడించాలి?

Posted: 03/17/2014 12:20 PM IST
World t20 warm up game preview india vs sri lanka

 టీ20 ప్రపంచకప్ లో ఎవరిని ఆడించాలి.. ఎవరిని పక్కనబెట్టాలి..తుది జట్టు కూర్పు ఎలా ఉండాలి. తెల్చుకోవటానికి  భారత్ కు ఓ అవకాశం . టోర్నీలో  నేరుగా సూపర్ -10 దశలో బరిలోకి దిగబోతున్న టీమ్ ఇండియా ..అంతకంటే  ముందు  రెండు  వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.  

తొలి మ్యాచ్  సోమవారమే శ్రీలంకతో  రెండు  వార్మప్ మ్యాచ్ ల్లో జట్టులో ఉన్న 15 మందినీ  పరీక్షించాలని  టీమ్ ఇండియా భావిస్తోంది.  యువరాజ్ సింగ్, సురేశ్  రైనాల  పునరాగమనంతో  కూర్పు విషయంలో  టీమ్ ఇండియాకు ఇబ్బందులు తప్పేలా లేవు.  వాళ్లిద్దరినీ ఆడించాలంటే రహానే, రోహిత్ , ధావన్ ల్లో  ఒకరిని  తప్పించక తప్పదు.  రోహిత్, థావన్  ఛాన్నాళ్లుగా జట్టులో ఉండగా .. ఈ మద్యే  జట్టులోకి వచ్చిన రహానే.. మంచి ఫామ్ లో ఉన్నాడు.  

ఆసియా కప్ లో అతను రెండు అర్థ సెంచరీలు చేశాడు.  ఈనేపథ్యంలో సీనియర్లు యూవీ, రైనాలిద్దరినీ ఆడించాలంటే  ఎవరిపై  వేటేయాలన్న సందిగ్థంలో  ఉన్న ధోని.. వార్మప్ మ్యాచ్  దీనికి సమాధానమిస్తుందని ఆశిస్తున్నాడు.  ఓపెనర్లుగా ఎవరిని పంపుతారనేది కూడా ఆసక్తికరమే.  

రహానేతో  ఇన్నింగ్స్ తో  ఆరంభించే ప్రయోగం  వార్మప్ మ్యాచ్ ల్లోనే  చూడొచ్చెమో. మరి రోహిత్  ఏ స్థానంలో  వస్తాడో  చూడాలి.  తుది జట్టులో  ముగ్గురు  పేసర్లు ఉండాలా, ముగ్గురు స్పిన్నర్లా అన్న విషయంలోనూ  వార్మప్   మ్యాచ్  ల ప్రదర్శన  ఆధారంగా ఓ నిర్ణయానికి వచే్చ  అవకాశముంది.  

ఆసియా కప్ లో  అద్బుత ప్రదర్శన  చేసిన శ్రీలంక పై నెగ్గి, టోర్నీకి  ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని  ధోనీ సేనా ఆశిస్తోంది. మరో వార్మప్ మ్యాచ్ లో  ఇంగ్లాండ్ తో  ఈరోజు తలపడున్న భారత్. టోర్నీలో  తన తొలి మ్యాచ్ ను   శుక్రవారం  పాకిస్థాన్ తో ఆడుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles