Ms dhoni after warm up loss against sri lanka

MS Dhoni, Dhoni, World T20, MS Dhoni after warm-up loss against Sri Lanka, World T20 warm-up, rst warm-up match, India vs Sri Lanka.

MS Dhoni after warm-up loss against Sri Lanka

ధోనికి ఇదో హెచ్చరిక?

Posted: 03/18/2014 12:48 PM IST
Ms dhoni after warm up loss against sri lanka

ధోని వచ్చాడు.. జట్టులోకి పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్, రైనా మెరిశారు అశ్విన్  ఆల్ రౌండ్ ప్రదర్శనతో  అదరగొట్టాడు.. కానీ టీమ్ ఇండియా ఆటతీరులో  గొప్ప మార్పులేమీ లేవు. టి20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ ప్రాక్టీస్ సరిపోతుందని చెప్పిన ధోని వార్మప్ మ్యాచ్‌లో దానిని ఆచరణలో పెట్టలేకపోయాడు. 

భారీ విజయలక్ష్యం కాకున్నా భారత బ్యాటింగ్ తడబడింది. కెప్టెన్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా బరిలోకి దిగినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు.

ఫలితంగా టోర్నీ తొలి వార్మప్ మ్యాచ్‌లో టీమిండియాకు పరాజయం తప్పలేదు. మలింగ చక్కటి బౌలింగ్‌తో చిన్న స్కోరును కూడా శ్రీలంక కాపాడుకోగలిగింది. ఓటమితో పోయేదేమీ లేకున్నా... జట్టు ప్రదర్శన మరింత మెరుగు పడాల్సి ఉందనేదానికి ఇదో హెచ్చరికలాంటిది.   

లంకపై గెలవాల్సిన  మ్యాచ్ ను చేజార్చుకుంది. ఫలితం గురించి ఆందోళన లేదు కానీ,  ఈ మ్యాచ్ తోనైనా  గాడిన పడతారనుకున్న కొందరు ఆటగాళ్లు   అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోకపోవడమే కలవరపరిచే అంశం.   లంకతో  వార్మవ్  మ్యాచ్ లలో  టీమ్ ఇండియా 5 పరుగల తేడాతో ఓడిపోయింది.  ఇది ధోనికి ఒక హెచ్చరిక.. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh