Jesse ryder dropped from new zealand t20

Jesse Ryder, New Zealand World T20 squad, World Twenty20, Jesse Ryder late night drinking, Jesse Daniel Ryder

Jesse Ryder dropped from New Zealand T20

తప్పతాగి వేటు దెబ్బ అనుభవిస్తున్నాడు

Posted: 02/17/2014 05:48 PM IST
Jesse ryder dropped from new zealand t20

బార్‌లో తప్పతాగి, తోటి క్రికెటర్‌తో గొడవపడి జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ జెస్సీ రైడర్ తగిన ఫలితం అనుభవించాడు. టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన కివీస్ జట్టులో జెస్సీ రైడర్‌కు చోటు దక్కలేదు. 

అతని స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. బ్రెండన్ మెకల్లమ్ సారథ్యం వహించనున్న జట్టులో డేవ్‌సిచ్, ట్రెంట్ బౌల్ట్, రోనీ హీరాలకు చోటు దక్కింది. 

టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుండటంతో, అక్కడి పిచ్‌లకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసినట్లు కివీస్ చీఫ్ సెలెక్టర్ బ్రూస్ ఎడ్గార్ చెప్పాడు. జెస్సీ రైడర్ ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే అతన్ని టీమ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదని ఎడ్గార్ తెలిపాడు.

-ఆర్ఎస్

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles