Virender sehwag did not fit into delhi daredevils plans says gary kirsten

Virender Sehwag, Gary Kirsten, Delhi Daredevils, ipl-7, India coach Gary Kirsten, Indian Premier League,ipl auction.

Virender Sehwag did not fit into Delhi Daredevils plans says Gary Kirsten

వీరూను అందుకే కొనలేదు

Posted: 02/17/2014 11:25 AM IST
Virender sehwag did not fit into delhi daredevils plans says gary kirsten

 ఐపీఎల్ -7 వేలంలో .. సీనియర్ ఆటగాళ్లు.. అధిక ధర పలకలేదు. దీంతో.. సీనియర్ ఆటగాళ్లు  చాలా అసంత్రుప్తిగా ఉన్నారు. అలాంటి వారిలో వీరేంద్ర సెహ్వాగ్.  ఐపీఎల్ -7 వేలంలో.. వీరేంద్ర సెహ్వాగ్ ను వేలంలో  కొనుగోలు చేయొద్దన్న నిర్ణయం అందరం తీసుకున్నామని ఢిల్లీ డేర్ డె విల్స్ జట్టు కోచ్ గ్యారీ  కిర్  స్టెన్ అన్నాడు.  

ఆ నిర్ణయం నేనొక్కడినే తీసుకోలేదు.. టీమ్ మేనేజ్ మెంట్ లో కీలకమైన వ్యక్తులందరూ కలిసి తీసుకున్న నిర్ణయమది. వీరూ గొప్ప ఆటగాడు. అందులో సందేహం లేదు. ఐతే  జట్టులో మార్పులు చేయాలనుకున్నాం.  మాకు ఎవరు సరిపోతారో ఓ అంచనాకొచ్చాం వారినే తీసుకున్నాం. కొన్ని విషయాలు భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. కానీ అంతిమంగా జట్టు ప్రయోజనాలను ద్రుష్టిలో  ఉంచుకోవాలి  అని కిర్ స్టెన్ చెప్పాడు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles