N srinivasan likely to be first icc chairman

N Srinivasan, BCCI chief N Srinivasan, ICC Board chairman, Srinivasan first ICC chairman, International Cricket Council, ICC,

BCCI chief N Srinivasan is likely to take over as the first ICC Board chairman.

ఐసీసీ ఛైర్మెన్ గా శ్రీనివాసన్

Posted: 01/29/2014 03:27 PM IST
N srinivasan likely to be first icc chairman

ప్రపంప దేశాలన్నింటిలోకెల్లా ఐసీసీలో అనధికార గుత్తాధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఇక పై పూర్తి అధికార పెత్తనం చలాయించడానికి సిద్దం అయ్యాయి. ఈ మూడు దేశాల బోర్డులు గుత్తాధిపత్యం కోసం వేసిన ఎత్తులకు ఐసీసీ బోర్డు ఏకగ్రీవ తీర్మానం చేసింది.భారత క్రికెట్ బోర్డు అభీష్ఠానికి అనుగుణంగా చాలా ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.

దీంతో త్వరలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి కాలం పూర్తి చేసుకోబోతున్న శ్రీనివాసన్ దీనికి కొత్త ఛైర్మెన్ గా పదవి భాద్యతలు చేపట్టబోతున్నాడు. మంగళవారం సుదీర్ఘంగా జరిగిన బోర్డు సమావేశంలో చాలా ప్రతిపాదనలకు ఏకగ్రీవ తీర్మానం లభించిందంటే ఈ మూడు దేశాల బోర్డులకు ఎంత ఆధిపత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఐసీసీ బోర్డు సమావేశంలో తీర్మానించిన అంశాలు :

ఐసీసీలో ఇక నుంచి బీసీసీఐ ప్రధాన నాయకత్వ బాధ్యతలు తీసుకుంటుంది. బీసీసీఐ, సీఏ, ఈసీబీ ఐదుగురు సభ్యులతో కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫైనాన్షియల్ కమిటీ, ఏర్పాటు చేసి, బోర్డులో ఎవరినైనా ఈ కమిటీకి నేత్రుత్వం వహించేవారిని ఎన్నుకోవచ్చు. అందులో భాగంగానే బీసీసీఐ ఛైర్మెన్ శ్రీనివాసన్ బాధ్యతలు చేపడతాడు.

-ఐసీసీలోని సభ్య దేశాలన్నింటికీ మెరిట్ ఆధారంగా అన్ని ఫార్మాట్లలో ఆడే వీలు కలుగుతుంది. సభ్యత్వ విషయంలో మార్పు ఉండదు. 

- టెస్టు క్రికెట్ నిధిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. దీంట్లో నుంచి బీసీసీఐ, ఆసీస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు మినహా మిగిలిన అన్ని దేశాలకు వార్షిక పద్దతిన ఆదాయం సమానంగా పంపిణీ అవుతుంది.

- శాశ్వత సభ్య దేశాలు కాని బోర్డుల్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన వాటికి ప్రోత్సాహకంగా అధిక ఆదాయాన్ని పంపిణీ చేస్తారు. నాలుగేళ్లలో మూడు ప్రధాన ఐసీసీ ఈవెంట్స్ జరుగుతాయి. దీంట్లో చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు టెస్టు చాంపియన్‌షిప్ ఆలోచన విరమించుకున్నారు.

- 2015 – 23 మధ్య రెండు దేశాల పరస్పర అంగీకారంతో ద్వైపాక్షిక సిరీస్ లు నిర్ణయించుకోవచ్చని తీర్మానించారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles