Ross taylor hundred takes nz to 7 wicket win

India lose series, Ross Taylor hundred, NZ 7-wicket win, India vs New Zealand, 4th ODI,team India, New Zealand, 4th oneday, Hamilton one day

Ross Taylor hammered his ninth ODI ton and his first century against India as New Zealand chased down 279 with 11 balls to spare.

నాలుగో వన్డేలో ఓటమి - సిరీస్ గోవిందా

Posted: 01/28/2014 02:52 PM IST
Ross taylor hundred takes nz to 7 wicket win

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత్ సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిని వచ్చింది. ఒక్కడ ఒక్క సిరీస్ ని కూడా గెలవకుండా వచ్చిన ధోనీ సేన ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే గట్టి పట్టుదలతో బయలు దేరింది. ప్రపంచ ఛాంపియన్లు కాబట్టి కివీస్ ఆటగాళ్ళు కూడా కాస్తంత భయపడ్డారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి తెలిసిందేమిటంటే విదేశాల్లో వీరి ప్రదర్శన అంతంత మాత్రమే అని. మొదటి రెండు వన్డేల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిన టీం ఇండియా మూడో వన్డేలో గెలుపుకు ఒక్క పరుగు దూరంలో నిలిచి మ్యాచ్ ని టైగా ముగించి సిరీస్ పై ఆశలు నిలుపుకుంది.

ఇక నాలుగో వన్డేలో ఖచ్చితంగా గెలుస్తారనుకుంటే ఎలాంటి పోరాటం చేయకుండా ఓడిపోయి సిరీస్ ని కోల్పోయింది. హామిట్టన్ లో నేడు జరిగిన నాలుగో వన్డేలో ధోని సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డ పై న్యూజిలాండ్ కి ఇచ్చిన 279 పరుగుల విజయ లక్ష్యం పెద్ద కష్టం ఏం కాలేదు. మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. రాస్ టేలర్ (112 నాటౌట్) సెంచరీతో విజృంభించగా, విలియమ్సన్ (60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

చివర్లో బ్రెండన్ మెకల్లమ్ (36 బంతుల్లో 49) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్నిఅ అందించారు. గత మూడు వన్డేల్లో బౌలింగ్ విభాగంలో అంత పెద్దగా రాణించిని బౌలర్లు ఈ మ్యాచ్ లో కూడా విఫలం అయ్యారు. వరుణ్ అరోన్, షమీ ఒక్కో వికెట్ తీయడం మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకుంది. నిర్ణీత యాభై ఓవర్లలో 278 పరుగులు ఐదు వికెట్లు కోల్పోయి చేసింది.  కోహ్లీ (2), రహానే (3) నిరాశపరచగా, రోహిత్ శర్మ (79)తో పాటు తెలుగుతేజం అంబటి రాయుడు (37) రాణించాడు. చివర్లో ధోనీ (79 నాటౌట్), జడేజా (62 నాటౌట్) విలువైన భాగస్వామ్యం నెల కొల్పడంతో  ఆ మాత్రం స్కోరు  సాధించారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో కాస్తంత తడబడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌధి రెండు, మిల్స్, బెన్నెట్, విలియమ్సన్ తలా వికెట్ తీశారు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles